Home అంతర్జాతీయ వార్తలు చికాగోలో కాల్పులు … ఒకరు మృతి

చికాగోలో కాల్పులు … ఒకరు మృతి

Person Shot Dead at Chicagoవాషింగ్టన్ : అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. చికాగో శివారులో ఉన్న ఓ వాణిజ్య సముదాయంలోకి చొరబడిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందారు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇది ఉగ్రవాద చర్యగా పలువురు అనుమానిస్తున్నారు.

Person Shot Dead at Chicago