Home తాజా వార్తలు ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాస్ మృతి

ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాస్ మృతి

Dead-Body

హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీన మానుకొండూరు ఎమ్మెల్యే రనమయి బాలకిషన్ కార్యాలయం ముందు ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాస్ అనే వ్యక్తి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచాడు. భూ పంపిణీలు అక్రమాలు జరుగుతున్నాయని ఈ నెల 3న గూడెం గ్రామానికి చెందిన శ్రీనివాస్ రసమయి కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. కాగా ఇరవై రోజులుగా చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్న శ్రీనివాస్ ఆదివారం మృతి చెందాడు.

శ్రీనివాస్ తో పాటు ఆత్మహత్య చేసుకున్న మరో వ్యక్తి యాలాల పరశురాములు పరిస్థితి నిలకడగా ఉందని, అతన్ని సోమవారం డిశ్చార్జి చేస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శ్రీనివాస్ మృతితో ఆయన స్వగ్రామం బెజ్జంకి మండలం గూడెంలో విషాదం నెలకొంది. ఈ ఘటనతో ఎమ్మెల్యే రసమయి ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. శ్రీనివాస్ మృతితో పలు చోట్ల ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.