Home తాజా వార్తలు చిన్నారిపై డ్రిల్ మాస్టర్ లైంగిక దాడి..!

చిన్నారిపై డ్రిల్ మాస్టర్ లైంగిక దాడి..!

PET Sexually assaulting 4 Year old girl: Hyderabad

హైదరాబాద్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే కామంతో కళ్లు మూసుకుపోయి అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన అమానుష సంఘటన నగరంలోని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సనత్‌నగర్‌లోని ఓ పాఠశాలలో యుకెజి చదువుతున్న నాలుగేళ్ల బాలికపై అదే పాఠశాలలో  డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తున్న శ్రీకాంత్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే, రోజూ మాదిరిగానే చిన్నారికి ఉదయం తల్లి స్నానం చేయిస్తుండగా ఆమె నొప్పితో బాధపడడం తల్లి గమనించి, ఏం జరిగిందని గట్టిగా అడగడంతో పిఇటి తనతో వ్యవహరించిన తీరును బాలిక తన తల్లితో చెప్పింది. దీంతో బాలిక తల్లి శనివారం ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.