Home తాజా వార్తలు అసెంబ్లీ రద్దు : పిటిషన్ కొట్టివేత

అసెంబ్లీ రద్దు : పిటిషన్ కొట్టివేత

Petition Dismissal on Assembly Dissolved

ఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయంపై హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయకుండా తెలంగాణ ప్రభుత్వం నాలుగున్నరేళ్లకే అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ హైదరాబాద్‌కు చెందిన కోమిరెడ్డి రాంచందర్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేసి, పిటిషన్‌ను కొట్టివేసింది. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలు, ఓటరు జాబితా వంటి పలు అంశాలపై సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయని, వీటిని హైకోర్టుకు బదలాయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Petition Dismissal on Assembly Dissolved