Home అంతర్జాతీయ వార్తలు దాడి భయంతోనే అలా ప్రవర్తించాను

దాడి భయంతోనే అలా ప్రవర్తించాను

petra-laszlo143సెర్బియా: శరణార్ధుల ప్రవేశం సందర్భంగా సెర్బియా సరిహద్దుల్లో ఓ చిన్నారిని ఎత్తుకుని పరుగెత్తుతున్న ఓ వ్యక్తికి కాలు అడ్డుపెట్టి వివాదంలో చిక్కుకున్న కెమెరా ఉమన్ లాస్జోల్ వివరణ ఇచ్చింది. తాను ఉద్దేశ పూర్వకంగా ఈ చర్యకు పాల్పడలేదంటూ హంగేరియన్ పత్రిక మాగ్‌యర్ నిమ్‌జట్‌కు ఒక లేఖ రాసింది. పెట్రాను గురువారం అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన అనంతరం విడిచిపెట్టారు. దీనిపై లాస్జోల్ వివరణ ఇస్తూ, వీడియో ఫుటేజ్ తాను కూడా చూశానని, నిజంగా ఎవరూ అలా ప్రవర్తించకూడదని, నిజా యితీగా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొంది. తాను హృదయం లేని అమ్మాయిని కాదని, ఆ సంఘటన జరిగేటప్పుడు తాను ఎంతో భయపడ్డానని చెప్పింది.

వందలాది మంది శరణార్థులు బారికేడ్లను నెట్టుకుంటూ వస్తున్న దృశ్యాన్ని కెమెరాలో బంధిస్తుండగా ఎవరో తనపై దాడి జరుపుతున్నట్టు భయానికి లోనయ్యాయని, కెమెరా కూడా ఉన్నందున తనవైపు వస్తున్నవారెవరో చూడలేకపోయానని చెప్పింది. తనపై దాడి జరుగుతోంద న్న భయంతోనే రక్షించుకునే ప్రయత్నంలో ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చిందని చెప్పింది. తనకు చావు బెదరింపులు కూడా వస్తున్నాయని, తాను కూడా ఓ మూమూలు స్త్రీనని తెలిపింది. ఒక చిన్నపిల్లకు తల్లికూడా అయిన తనకు ఇప్పుడు ఉద్యోగం కూడా లేకపోవడం మరింత బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.