Home జాతీయ వార్తలు పెరిగిపోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెరిగిపోయిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

petrol

ముంబయి: పెట్రోల్‌ ధరలకు రోజురోజుకు రెక్కలొచ్చాయి. ధరలు పెరుగుతూ వాహనదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. శుక్రవారం 55 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. శనివారం కూడా జోరు తగ్గించకుండా పెట్రోల్‌ ధరలు మరో 13 పైసలు పెరిగి లీటరుకు రూ.74.21గా నమోదుకాగా, మరోవైపు డీజిల్‌ ధరలను కూడా 15 పైసలు చొప్పున పెరిగి రూ.65.46కు చేరుకుంది. 2013 సెప్టెంబర్‌ తరువాత ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే మొదటి సారి. పెట్రోల్ ధర పెరుగులకు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అధికమవడమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.