Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు

Petrol-Pumps

న్యూఢిల్లీ: ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు తరుచూ వస్తున్న ధరల హెచ్చుతగ్గులను బ్రేక్ వేయడంకోసం కేంద్ర ప్రభుత్వం బేసిక్ ఎక్సైంజ్ సుంకాన్ని లీటర్ కు రెండు రూపాయల మేర తగ్గించింది. నూతన ఎక్సైజ్ డ్యూటీ బుధవారం నుండి అమల్లోకి రానుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు బ్యారెల్ ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. గత నెల అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరు ఏకంగా 12 శాతం మేరకు పెరిగాయి.
భారత వినియోగదారులు అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా పెట్రో ధరలను చెల్లించాల్సి రావడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులూ పెట్రో ఉత్పత్తుల ధరలకు రెక్కలు తెస్తున్నాయి. ఇక పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో పెట్రోల్; డీజిల్ ధరలు లీటరుకు రూ.2 వరకు తగ్గనున్నాయి.

Petrol and diesel prices cut

Comments

comments