Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

రెండవ రోజు తగ్గిన పెట్రోల్, డీజిల్‌ ధరలు

petrol-image

హైదరాబాద్: ఆయిల్ కంపెనీలు గురువారం కూడా పెట్రోల్, డీజిల్ పై ధరలను తగ్గించాయి. వరసగా రెండవ రోజు ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. లీటర్ పెట్రోల్ పై 7 పైసలు, లీటర్ డీజిల్ పై 5 పైసలు తగ్గిస్తున్నట్టు ఇవాళా ఆయిల్ సంస్థలు ప్రకటించాయి. బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిన విషయం తెలిసిందే. మొదటి రోజు లీటర్ మీద 1పైసా మాత్రమే తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కంపెనీ వెల్లడించింది. అయితే ఈరోజు మాత్రం లీటర్ ధరపై కొంత భారాన్నితగ్గించి ఊరటినిచ్చిందనే చెప్పాలి. ఆయిల్ ధరల తగ్గింపుపై బుధవారం కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొదట లీటర్ పై 60 పైసలు తగ్గిస్తున్నట్టు వార్తాలు వచ్చాయి. ఆ వార్తను ఖండిస్తూ ఐఒసి మరో ప్రకటన విడుదల చేసింది. ఇంధన ధరలను కేవలం ఒక్క పైసా మాత్రమే తగ్గిస్తున్నట్టు తెలిపింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేటప్పుడు రూపాయల్లో పెంచి పైసల్లో తగ్గిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వాస్తవానికి 15 రోజుల సగటు ధరల ఆధారంగా ఆయిల్ సంస్థలు ఇంధన ధరలను నిర్ణయిస్తాయి. ఇటీవల అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతువచ్చాయి. కానీ ఆరేట్లను అమలు చేయాడానికి మనకు మరి కాస్త సమయ పడుతుందని నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.

Comments

comments