Home తాజా వార్తలు మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

Petrol and diesel prices hikes once again Today

న్యూఢిల్లీ: పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోలుపై 16 పైసలు, డీజిల్‌పై 19 పైసలు పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో కలుపుకుని దేశంలోని ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలు ధర రూ. 84.09, డీజిల్ రూ. 77.60, దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు రూ. 79.31, డీజిల్ రూ. 71.34, ముంబయిలో లీటర్ పెట్రోలు రూ. 86.72, డీజిల్ రూ.75.54, విజయవాడలో పెట్రోలు రూ. 85.59, డీజిల్ రూ. 78.76, చెన్నైలో లీటర్ పెట్రోలు రూ. 82.41, డీజిల్ రూ. 75.39గా ఉంది. కాగా, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో పాటుగా చమురు రవాణాపై అత్యధికంగా ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుండడంతో చమురు ధరలకు రెక్కలు వస్తున్నాయి. వీటికి తోడు రూపాయి పతనం కావడం కూడా ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.