Search
Saturday 22 September 2018
  • :
  • :

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol-Pumps

న్యూఢిల్లీ: తగ్గుతూ వస్తున్న పెట్రోలు తాజాగా పెరిగాయి. లీటరు పెట్రోలుపై రూ.1.23 పెరగ్గా, లీటరు డీజిల్ ధర 89 పైసలు పెరిగింది. ఈమేరకు ఆయిల్ కంపెనీలు ప్రకటన చేశాయి. ఈ కొత్త రేట్లు బుధవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. పక్షం రోజులుకోసారి అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా పెట్రో ధరలను ఆయిల్ కంపెనీలు సవరిస్తాయి. దీని ప్రకారం ఈసారి వీటి రేట్లు పెరిగాయి. పదిహేను రోజుల క్రితం మే 16న లీటరు పెట్రోలుపై రూ.2.16, డీజిల్‌పై 2.10 తగ్గిన విషయం తెలిసిందే. తాజాగా సవరించిన రేట్ల ప్రకారం ఢిల్లీలో ప్రస్తుత లీటరు పెట్రోలు ధర రూ.65.32 నుంచి రూ.66.91కు పెరగనుంది. అదే విధంగా ప్రస్తుత డీజిల్ ధర రూ.54.90  నుంచి రూ.55.79 కానుంది. స్థానిక వ్యాట్‌తో కలిపి రేట్లను పెంచినట్టు దేశీయ అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ ప్రకటించింది. అంతర్జాతీయ ధరల ప్రకారం పక్షం రోజులకోసారి ఈ పెట్రో ధరలను సవరిస్తున్నామని, ఈసారి ధరలు పెరిగాయని సంస్థ వెల్లడించింది.

Comments

comments