Friday, April 26, 2024

స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు

- Advertisement -
- Advertisement -

Petrol and Diesel prices Reduced again

న్యూఢిల్లీ: దాదాపు నెల రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి.ఆదివారం లీటర్ పెట్రోల్, డీజిలుపై 20 పైసల వంతున ధరల్లో స్వల్పంగా తగ్గగా.. మంగళవారం పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 16 పైసలు తగ్గాయి. వారం రోజుల్లో పెట్రోలు ధరలో ఇది రెండో తగ్గింపు కాగా, డీజిల్ ధరలో ఐదోసారి తగ్గింపు. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర రూ.105.54 కాగ, లీటర్ డీజిల్ ధర రూ.96.99గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోలు ధర రూ.107.07, లీటర్ డీజిల్ ధర రూ.98.87గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ.107.66, లీటర్ డీజిల్ ధర రూ.96.64గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.101.64, లీటర్ డీజిల్ ధర రూ.89.87గా ఉంది.

ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి మొత్తం 41 సార్లు పెట్రోధరలను పెంచిన విషయం తెలిసిందే. దాదాపు ఒక నెలపాటు రోజు విడిచి రోజు చమురు ధరలు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో లీటరు పెట్రోలు ధర రూ.11.44, డీజిలు ధర రూ.8.74 మేర పెరగడం గమనార్హం.

Petrol and Diesel prices Reduced again

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News