Search
Sunday 18 November 2018
  • :
  • :

16 నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు రోజువారి మార్పు

petrol-price-reduce-image-d

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూన్ 16 నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు రోజువారి మార్పులకు గురికానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ పద్ధతి  ఐదు నగరాలలో ప్రయోగాత్మకంగా విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అమలుచేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 58,000 పెట్రోల్ బంకుల్లో జూన్ 16 నుంచి రోజువారి రేట్లను  ప్రభుత్వ చమురు కంపెనీలు అమలుచేయనున్నాయి. విదేశీమారకం రేట్లలో మార్పులు, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల హెచ్చుతగ్గుల ఆధారంగా ఈ రోజువారి రేట్లు ఉండనున్నాయి. ఈ రేట్లు  వేర్వేరు నగరాలలో, ఐఓసి, హెచపిసిఎల్, బిపిసిఎల్ వంటి చమురు కంపెనీల వేర్వేరు పెట్రోల్ పంప్ కేంద్రాలలో భిన్నంగా ఉండనున్నాయి. అయితే ఈ రేట్లలో స్వల్ప తేడానే  ఉండగలదంటున్నారు.

Comments

comments