Home జాతీయ వార్తలు పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గనున్నాయి

పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గనున్నాయి

Petrol

త్వరలో పెట్రోలు,డీజిల్ ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన ముడి చమురు ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.

చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో నాలుగు నెలల కనిష్ఠానికి చేరుకున్నాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధరలు సైతం నాలుగు నెలల కనిష్ఠానికి దిగజరాడంతో , ఇది 50 డాలర్ల దిగువ ట్రేడ్ అవుతోంది. అమెరికాలో కొత్త చమురు క్షేత్రాల అన్వేషణ అంచనాలకు మించి అధికంగా ఉంది.

అమెరికాలో ముడి చమురు నిల్వలు మరో యాబై లక్షల బ్యారెళ్లు పెరిగాయి. దీంతో కొనుగోళ్లు మందగించాయి. అమెరికాలో క్రూడాయిల్ వెలికితీత పెరుగుతున్నందున పతనమవుతున్న ధరలను స్థిరీకరించేందుకు ఒపెక్ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వస్తుంది.

మేలో డెలివరీ అయ్యే బ్యారల్ క్రూడాయిల్ ధర 49.71 డాలర్లుగా ఉందని ఇంటర్ ఫాక్స్ ఎనర్జీ అనలిస్ట్‌లు చెబుతున్నారు. నవంబరు తరువాత ముడి చమురు ధరలు ఇంత తక్కువగా చేరడం ఇదే ప్రథమమని, ఈ ప్రభావంతో భారత్ క్రూడ్ బాస్కెట్ ధరపై ఉండడం వల్ల పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గి వినియోగదారులకు కాసింత ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి.