Friday, April 26, 2024

మళ్లీ స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

- Advertisement -
- Advertisement -

Petrol price can come down to Rs 75 if brought gst

 

న్యూఢిల్లీ: వారం రోజుల వ్యవధిలో మూడవ సారి పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్‌పై 22 పైసలు, డీజిల్‌పై 23 పైసలు తగ్గినట్లు ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలు ప్రకటించాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలలో తగ్గుదలే పెట్రోల్, డీజిల్ ధరలలో స్వల్ప తగ్గుదలకు కారణమని తెలుస్తోంది.
ప్రస్తుత ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 90.56, లీటర్ డీజిల్ రూ. 80.87 ఉంది. దేశవ్యాప్తంగా ఈ తగ్గింపు అమలులోకి వచ్చింది. అయితే స్థానిక పన్నుల కారణంగా వివిధ రాష్ట్రాలలో ధరలలో తేడా ఉంటుంది. మంగళవారం ముంబయిలో లీటర్ పెట్రోల్ ధరల రూ. 97.19 నుంచి రూ. 96.98కి తగ్గింది. డీజిల్ ధర రూ. 88.20 నుంచి రూ. 87.96కి తగ్గింది. గడచిన వారం రోజుల్లో మూడుసార్లు ధరలు తగ్గింపుతో మొత్తానికి లీటర్ పెట్రోల్‌పై 61 పైసలు, డీజిల్‌పై 60 పైసల తగ్గింపు జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News