Search
Wednesday 18 July 2018
  • :
  • :

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర

bsns

 పెట్రోల్ 13పైసలు, డీజిల్‌పై 10పైసలు పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. 36 రోజుల అనంతరం పెట్రోల్ ధరలు గురువారం నుంచి పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే శనివారం కూడా లీటర్ పెట్రోల్‌పై 13పైసలు, డీజిల్‌పై 10పైసలు పెంచుతున్నట్లు చమురు కంపెనీలయిన ఐఒసి,హెచ్‌పిసిఎల్, బిపిసిఎల్‌లు ప్రకటించాయి. దీంతో శనివారం నాటికి లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ. 75.98, ముంబయిలో రూ.83.37, కోల్‌కతాలో రూ.78.66, చెన్నైలో రూ.78.85, హైదరాబాద్‌లో రూ.80.35కు చేరుకుంది. లీటర్ డీజిల్‌పై 10పైసలు పెరిగి ఢిల్లీలో రూ. 67.76, ముంబయిలో రూ. 71.90, కోల్‌కతాలో రూ. 70.31, చెన్నైలో రూ.71.52, అత్యధికంగా హైదరాబాద్‌లో రూ. 73.54కు చేరింది. పెట్రోల్ ధరలు చివరిసారిగా జూన్ 26న తగ్గాయి. ఆరోజు నుంచి ధరలను జూలై 5వరకు యథావిథిగా ఉంచిన చమురు కంపెనీలు తొలిసారి గురువారం పెంచాయి.

Comments

comments