Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

petrol1

న్యూఢిల్లీ : వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఎట్టకేలకు తగ్గాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.1.46 పైసలు, డీజిల్ ధర రూ.1.53 పైసలు తగ్గింది. తగ్గిన పెట్రోల్ ధరలు మంగళవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు చమురు సంస్థలు ఒక ప్రకటన చేశాయి. నవంబర్ 5న పెట్రోలు ధర లీటరుకు 89 పైసలు పెరగ్గా, సెప్టెంబర్ నెల నుంచి ఇది ఆరోసారి పెంపు, అయితే తాజాగా వీటి ధరల తగ్గింపు వినియోగదారులకు కాస్త ఊరటనివ్వనున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరల ఆధారంగా ఆయిల్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

గ్లోబల్ రేట్లు తగ్గిన మేరకే పెట్రో, డీజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని చమురు సంస్థలు ప్రకటించాయి. అంతర్జాతీయ రేట్ల ఆధారంగా పక్షం రోజులకోసారి పెట్రో ధరలను ఆయిల్ కంపెనీలు సవరిస్తాయి. దీని ప్రకారం, న్యూఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో బ్రాండ్ యేతర పెట్రోలు ధర లీటరుకు రూ.65.93, కోల్‌కతాలో రూ.68.67, ముంబయిలో రూ.72.29, చెన్నైలో రూ.65.41గా ఉండనుంది. వరుసగా పెరుగుతున్న పెట్రో ధరల పట్ల ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్న సందర్భంలో ఈసారి ధరలు తగ్గటం ప్రజలకు ఊరట కల్గించాయి.

Comments

comments