Home జాతీయ వార్తలు మళ్లీ పెరిగిన పెట్రో ధరలు…

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు…

Petrol price hike

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దిశగా పరుగులు పెడుతున్నాయి. చమురు కంపెనీలు ఆదివారం ధరలలను మళ్లీ పెంచాయి. అక్టోబర్ 4న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పెట్రోలు, డీజిల్‌పై సుంకాన్ని లీటర్‌కు రూ.2.50 తగ్గించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రకటన అనంతరం మరికొన్ని బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా సుంకాన్ని తగ్గించాయి. అయితే,  సుంకాన్ని తగ్గించినప్పటికీ ధరల పెరుగుదల మాత్రం ఆగడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు ఢిల్లీలో లీటరు పెట్రోలుపై 14 పైసలు, డిజిల్‌పై 29 పైసలు పెంచాయి. ఫలితంగా లీటరు పెట్రోలు ధర రూ.81.82కు చేరుకోగా, డీజిల్ ధర రూ.73.53కి చేరింది. ముంబయిలో పెట్రోలుపై 14 పైసలు, డీజిలుపై 31 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో ముంబయి లీటరు పెట్రోలు ధర రూ.87.29కు చేరుకుని వంద దిశగా పరుగులు తీస్తుండగా డీజిల్ రూ.77.06కు చేరుకుంది. ఇప్పటికే లీటర్ పెట్రోల్, డీజిల్ పై కేంద్రం ప్రభుత్వం రూ. 2.50 తగ్గింపుపై నెటిజన్లు సోషల్ మీడియాలో పండగ చేసుకోవాలా..! అని సెటైర్ల వర్షం కురిపిస్తున్నవిషయం తెలిసిందే.