Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

పెట్రో జ్వాల

petrol price increase in india

3 రోజుల్లో రూపాయికి పైగా పెరిగిన పెట్రోలు
ఢిల్లీలో లీటరు ధర రూ.79పైనే
ముంబయిలో రూ.86.56 

న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో పాటుగా చమురు రవాణాపై అత్యధికంగా ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుండడంతో చమురు ధరలకు రెక్కలు వస్తున్నాయి. వీటికి తోడు రూపాయి పతనం కావడం కూడా ఇం ధన ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా సోమవారం పెట్రో లు, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. సోమవారం చమురు కంపెనీలు పెట్రోలు ధర లీటరుకు 30 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధానిలో తొలిసారిగా పెట్రోలు ధర లీటరుకు రూ.79 మార్కును దాటిపోయింది. ఇక ముంబయి, కోల్‌కతా, చెన్నై నగరాల్లో పెట్రోలు ధర లీటరుకు 30-32 పైసలు పెరిగింది. ఫలితంగా ముంబయిలో పెట్రోలు ధర లీటరుకు రూ.86.56కు చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా పెట్రోలు ధర ఇంత లేదు. కాగా కోల్‌కతాలో పెట్రోలు ధర లీటరు రూ.82.06, చైన్నైలో రూ.82.24గా ఉంది.

మరోవైపు డీజిలు ధర పెరుగుదల పెట్రోలుకన్నా ఎక్కువే అంటే లీటరుకు 39 పైసలు ఉంది. దీంతో ఢిల్లీలో డీజిలు లీటరుకు రూ.71.15కు చేరుకోగా, ముంబయిలో రూ. 75.54, చెన్నైలో రూ.75.19, కోల్‌కతాలో రూ. 74గా ఉంది. ఈ నెల 1వ తేదీనుంచి గత మూడు రోజుల్లోనే పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు రూపాయికి పైగానే పెరిగాయి. పెట్రోలియం ఉతత్తులను జిఎస్‌టి పరిధిలోకి తేవాలని కాంగ్రెస్‌తో పాటుగా ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో కోరుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఆలోచించడం మాని వేసి రాష్ట్రాలు స్థానిక పన్నులను తగించడం ద్వారా వినియోగదారుడిపై భారాన్ని తగ్గించాలని సూచిస్తూ ఉండడం గమనార్హం.  పెట్రో ధరలు ఇలాగే పెరుగుతూ పోతే లీటరు పెట్రోలుధర రూ.100కు చేరే రోజు ఎంతో దూరంలో లేదని కూడా విమర్శకులు అంటున్నారు. ఈ ఏడాది చివర్లో మూడు బిజెపి పాలిత రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతుండడంతో పాటు వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు కూడా ఉండడంతో  ఇంధన ధరలు ప్రభావం అధికార పార్టీవిజయావకాశాలను దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Comments

comments