Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పెట్రో ధరలు పైపైకే…

Petrol prices increase by 28 paise

లీటర్‌పై 28, డీజిల్ 22 పైసల భారం 

న్యూఢిల్లీ : పెట్రోలు  డీజిల్ ధరలు శుక్రవారం మరింతగా పెరిగాయి. పెట్రోలుపై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 22 పైసలు చొప్పున భారం మోపారు. రూపాయి పతనం కొనసాగింపు, అంతర్జాతీయంగా చమురు రేట్లలో ఎదుగుదలతో దేశంలో వీటి ధరలను పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ ధరల నోటిఫికేషన్‌లో తెలిపాయి. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ 81.28కి, డీజిల్ ధర లీటర్‌కు రూ 73.30కు చేరుతుంది. ముంబైలో పెట్రోలు ధరలు లీటర్‌కు రూ 88.67, చెన్నైలో రూ 84.49. కోల్‌కతాలో రూ 83.14,కు చేరుతుంది. ఇక ముంబైలో  డీజి ల్ ధరలు వరుసగా రూ.77.82, చెన్నైలో  రూ 77.49, కోల్‌కతాలో రూ 7536కు చేరుకుంటుంది. అన్ని మెట్రో నగరాలు, రాష్ట్రాల రాజధానులతో  పోలిస్తే ఢిల్లీలోనే ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయి. తక్కువ తక్కువ స్థాయి పన్నులతో ఇది సాధ్యం అయింది. ఇక ముంబైలో అన్నింటి కన్నా అత్యధికపు అమ్మకపు పన్ను లేదా వ్యాట్ ఉంది. ఇక రూపాయి పతనం కొనసాగడం, ఆగస్గు నెల మధ్య నుంచి ముడిచమురు ధరలు పెరుగుతూ పోవడంతో ఇంధన ధరలు ఆగకుండా పెరుగుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకూ చూస్తే మొత్తం మీద పెట్రోలుపై లీటర్‌కు రూ 4.20 చొప్పున, డీజిల్‌పై రూ 4.53 చొప్పున పెరుగుదల నమోదు అయిందని గణాంకాలతో వెల్లడైంది. కీలకమైన కారణాలతో ఇంధన ధరలు పెరగడంతో పాటు ఇక నగరాల వారిగా, ప్రాంతాలత వారిగా చివరికి బంకుల స్థాయిగా స్థానిక పన్నులు, రవాణా వ్యయభారం పేరిట ఇంధన ధరలలో వ్యత్యాసం కొట్టోచ్చినట్లుగా కనబబుతోంది. దీనితో వాహనదారులు అనేక విధాలుగా ఇక్కట్లకు గురి అవుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచము రు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్ల స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే దాదాపు72 వద్ద ఊగిసలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ సూచీకి అనుగుణంగానే అనివార్యంగా ధరలను సవరించుకోవల్సి ఉంటుందని చమురు సంస్థలు సెలవిస్తున్నాయి. ఈ వడ్డింపుల క్రమంలో వాహనదారుడి ఆర్థిక  స్థితి గతి తప్పుతోంది.

Comments

comments