Home జాతీయ వార్తలు రికార్డుస్థాయిలో పెరిగిన పెట్రోల్ ధర!

రికార్డుస్థాయిలో పెరిగిన పెట్రోల్ ధర!

petrol1

న్యూఢిల్లీ : వాహనదారులకు కేంద్ర చమురు కంపెనీలు మరోసారి పెద్దషాకిచ్చాయి. ప్రధానిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పెట్రోల్ ధరలు అత్యధిక గరిష్ట ధరలు నమోదు చేసుకున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.79.41గా రికార్డైంది. ఈ రోజు ఒక్కరోజే లీటర్ పెట్రోల్ ధర 13 పైసలు, లీటర్ డీజిల్ ధర 25 పైసలు పెరిగింది. పెట్రోల్ అమ్మకాలను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురాకపోవడంతో, పెట్రోల్ ధరలు ఒక్కోరాష్ట్రంలో విభిన్నంగా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.30, కోల్‌కత్తాలో రూ.73.05గా, చెన్నైలో రూ.72.87గా ఉన్నాయి. రోజువారీ సమీక్ష విధానం చేపట్టిన తర్వాత పెట్రోల్ లీటరు 7 రూపాయిల మేర పెరిగినప్పటికీ, ఇదే విధానాన్ని కొనసాగిస్తామని పెట్రోలియం మంత్రి ధర్మేంద్రప్రధాన్ చెప్పడం గమనార్హం.