Home జాతీయ వార్తలు లీటర్ పెట్రోల్ రూ.300..!

లీటర్ పెట్రోల్ రూ.300..!

Petrol-Tripuraఅగర్తలా : భారీ వర్షాలు త్రివుర రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం నిత్యావసర వస్తువులు సైతం అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ధరలు అకాశానంటుతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ రూ.300 పలుకుతుండగా, డీజిల్ రూ.150కి అమ్ముతున్నారు. దీంతో సాధారణ ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది.
పెట్రోలు ధరలు మండుతుండటంతో ప్రజలు ఆందోళన బాటపట్టారు. పెట్రోల్ బంకుల ఎదుట టైర్లకు నిప్పుపెట్టి నిరసనలు చేపట్టారు. రాష్ట్ర సచివాలయానికి వెళ్లే రహదారులను ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు దిగ్భందించారు. ప్రజల నిత్యావసరాల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. సరి-బేసి పద్ధతిలో పెట్రోలు సరఫరాకు ఆదేశాలు జారీ చేసింది.