Home జాతీయ వార్తలు పెద్ద షాకివ్వనున్న పెట్రోల్..?

పెద్ద షాకివ్వనున్న పెట్రోల్..?

reduced-petrol,-desiel-prieముంబయి : వాహనమేదైనా.. దానికి ఇం‘ధనం’ తప్పదూ.. అయితే ప్రస్తుతం సామాన్యుడు వాహనం కొనాలంటే జంకేలా ఉన్నాయి పరిస్థితులు.. ఇందుకు కారణం రోజురోజుకి ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలే.. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు మోత మెగనున్నాయని సమాచారం. తాజాగా వెలువడిన ఆయిల్ ధరల నివేదిక మేరకు ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.63.02, డీజిల్ ధర లీటర్‌కు రూ.51.67కు పెరిగిందట. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయి. డాలరుతో పోలీస్తే దేశీయ కరెన్సీ విలువ తగ్గడం, పెరిగిన డిమాండ్ ఉత్పత్తి తక్కువ కావడమే ఇందుకు కారణాలుగా తెలుస్తున్నాయి. గ్లోబల్ క్రూడ్ అయిల్ ధరలు ఏడు నెలల తర్వాత మొదటిసారి, బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్, బ్యారల్ ధర 50 డాలర్లకు పెరిగిందని తాజా నివేదికల్లో వెల్లడైంది. పైగా 2014 మే అనంతరం నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలనలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీలు కూడా రెండింతలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై వేసే పన్నులతో పాటే వాటి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి.