Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ప్రతికూల భావాలు పోవాలంటే..

పెంపుడు జంతువులను పెంచుకుంటున్నవారు మిగతావారి కంటే మానసికంగా, శారీరకండా దృఢంగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తెలిసినట్లు చికాగో యూనివర్సిటీ పరిశోధక బృందం వెల్లడించింది. కుక్క, పిల్లిలాంటి జంతువులను పెంచుకుంటున్నవారి మిగతావారికంటే ఆనందంగా ఉత్సాహంగా ఉన్నట్లు వారు తెలిపారు.  మనలోని   ఆక్సిటోసిన్ స్థాయి పెరగడానికి పెట్స్ దోహదపడతాయి. దీన్ని బాండింగ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇవి తమ యజమానుల రక్తపోటు, హృదయ స్పందన రేటును తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  ఒత్తిడి, కోపం, నిరాశలాంటి ప్రతికూల భావాలను తగ్గిస్తాయి.  

pet-fed

అలర్జీల నుంచి ఉపశమనం
కళ్లు ఎరుపు రంగులోకి మారడం, ముక్కు కారడం, చర్మం దురద లెక్కడం, గురక పెట్టడంలాంటివి అలర్జీకి గురైనప్పుడు జరిగే మార్పులు. ఇలాంటివి నిరోధించడం పెంపుడు జంతువుల వల్లే సాధ్యమవుతుంది. సాధారణంగా పెట్స్ వల్లే ఎలర్జీలు వస్తాయనే అపోహ ఉంది. పెట్స్‌ను పెంచుకునే మొదట్లో ఎలర్జీకి కారణం కావచ్చు కానీ అది ప్రమాదకం మాత్రం కాదు. తామర, ఆస్తమాలాంటి రోగాల నుంచి బయటపడేలా చేస్తాయి ఇవి.
ఫిట్‌నెస్‌ను పెంచుతాయి
కుక్కను పెంచుకునే యజమానులు మిగతా వారి కంటే శారీరకంగా ఫిట్‌గా ఉంటారు. ఉదయం సాయంత్రం వేళల్లో పెంపుడు జంతువుతోపాటే వాకింగ్ చేస్తుంటారు. దీని వల్ల ఊబకాయం బారి నుంచి బయట పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. 2000 మంది కుక్కల యజమానులపై చేసిన పరిశోధన ఫలితంగా ఈ విషయం తెలిసింది. కుక్కలను పెంచుకుంటున్న 71, 82 సంవత్సరాల వృద్ధులు చాలా ఉత్సాహంగా దృఢంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.
ఒత్తిడిని తగ్గిస్తాయి
ఒత్తిడి పెరగడం వల్ల కార్డిసాల్ అనే హార్మోన్ విడుదలౌతుంది. ఇది గుండెకు సరఫరా అయ్యే రక్తం వేగాన్ని పెంచుతుంది. రోజులో కొంతసేపు పెంపుడు జంతువులతో ఆడుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.
గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి
పెట్స్ మన ప్రతి పనిలో భాగస్వాములవుతుంటాయి. కనుక వాటితో మనం ఆనందంగా ఉండటం వల్ల మానసికంగా, సంతోషంగా ఉంటాం. దీని వల్ల గుండెకు మేలు.
అల్జీమర్స్ రోగులకు ఉపశమనం కలిగిస్తాయి
జంతువులు. ఆటిజం పిల్లలకు మంచి నేస్తాలు. ఒంటరితనం అనుభవిస్తున్నవారు, నిరాశకు గురైన వారికి పెంపుడు జంతువులు సరైన తోడు.
క్యాన్సర్ రాకుండా కాపాడతాయి
జంతు అసిస్టెడ్ థెరఫీ క్యాన్సర్ రోగులకు ఊరటను కలిగిస్తుంది. కుక్కలు వాసన చూడటం ద్వారా క్యాన్సర్‌ను ముందుగానే కనిపెడతాయని మరో అధ్యయనంలో తేలింది. శారీరక గాయాలు, బాధలను మరపించే శక్తి పెంపుడు జంతువులకుంది.

Comments

comments