Home తాజా వార్తలు రజినీ ‘పేట’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్

రజినీ ‘పేట’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్

Pettaసౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కుర్ర దర్శకుడు కార్తీక్ సుబ్బ‌రాజు కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘పేట’. తాజాగా ఈ మూవీ తెలుగు వర్షెన్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇటీవ‌ల చిత్ర ట్రైల‌ర్ త‌మిళ వ‌ర్షెన్‌ విడుద‌లై మంచి స్పందన రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ లో సూపర్ స్టార్ స్టైలిష్ మేనరిజంతో అదరగొట్టారు. రజినీ సరసన సీనియర్ హీరోయిన్లు సిమ్రాన్, త్రిష నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, శశి కుమార్ నటిస్తుండగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ర‌విచంద్రన్ స్వరాలు అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ చిత్రాన్ని నిర్మించింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 10న మూవీ థియేటర్లలోకి వస్తోంది.

Petta Official Telugu Trailer is Released