Search
Thursday 19 July 2018
  • :
  • :
Latest News

‘ఫార్మా’ పుంజుకుంటోంది..

 bs

జూన్ త్రైమాసికంలో 17 శాతం ఆదాయం వృద్ధి అంచనా

 దేశీయంగా పటిష్ఠ వృద్ధి, కరెన్సీ పరంగా సానుకూలతలు

 ఎడిల్వీస్ సెక్యూరిటీస్ నివేదిక

న్యూఢిల్లీ: భారతీయ ఫార్మా రంగం కొద్ది నెలల క్రితం అమెరికా నియంత్రణ సంస్థ నుంచి ఇబ్బందులు ఎదుర్కొని వృద్ధి రేటు మందగించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(201819) తొలి త్రైమాసికం(ఏప్రిల్‌జూన్)లో ఫార్మా రంగం ఆదాయం వృద్ధి 17 శాతం మేరకు ఉండనుందని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ నివేదికలో పేర్కొంది. దేశీయంగా పటిష్ఠమైన వృద్ధి, కరెన్సీ విలువ పతనం కారణంగా మార్జిన్ పెరుగుదలకు దోహదం చేయడం వంటి అంశా ఫార్మా వృద్ధికి కారణమవుతున్నాయని వెల్లడించింది. జిఎస్‌టికి సంబంధించిన అవాంతరాల కారణంగా దేశీయ అమ్మకాలు స్వల్పంగా 26 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చు. వార్షికంగా అమెరికా అమ్మకాలు వృద్ధిని సాధించినప్పటికీ త్రైమాసికంగా చూస్తే 2 శాతం పతనమవనుందని నివేదిక పేర్కొంది. అమెరికా కరెన్సీ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 శాతం క్షీణించడం, అలాగే యూరో, యెన్ కరెన్సీలతో పోలిస్తే 11, 5 శాతం చొప్పున పతనం కావడం ఫార్మా సంస్థ మార్జిన్ పెరగడానికి కారణమైంది. దీనివల్ల వార్షికంగా 350 బేసిస్ పాయింట్లు, జూన్ త్రైమాసికంలో 100 బేసిస్ పాయింట్లు ఇబిఐటిడిఎ మార్జిన్ పెరగనుందని ఎడిల్వీస్ తెలిపింది. రెగ్యులేటరీ సంస్థ నుంచి అనుకూలమైన వాతావరణం ఫార్మాకు ఆశావాహంగా ఉంది. మార్చి త్రైమాసికంలో తాత్కాలిక విరామం తర్వాత అమెరికా ఎఫ్‌డిఎ(ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతి రేటు 198కు పుంజుకుంది. ఇటీవల సన్‌ఫార్మాకు చెందిన హలోల్ ప్లాట్‌కు యుఎస్ ఎఫ్‌డిఎ అనుమతి నేపథ్యంలో భారతీయ ఔషధ సంస్థలకు అనుమతి రేటు పుంజుకునే అవకాశముందని నివేదిక అంచనా వేసింది. రెగ్యులేటరీ పరంగా చూస్తే కాడిలా టోపికల్స్ ప్లాంట్, రెడ్డీస్ మెదక్, శ్రీకాకుళం సెజ్, సన్‌ఫార్మాకు చెందిన హలోల్ ప్లాంట్ల వద్ద తనిఖీలు సానుకూలంగా ఉన్నాయి. వీటిపై తలెత్తిన ఆందోళనలు త్వరలో సమసిపోయే అవకాశముందని నివేదిక వివరించింది. అయితే అమెరికా ధరలకు సంబంధించిన సమస్యలు ఇప్పటికీ ఆందోళకరంగానే ఉన్నాయని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ పేర్కొంది. 201819 ఆర్థిక సంవత్సరంలో ఫార్మా రంగం ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశముంది. అలాగే దేశీయంగా అమ్మకాలు పుంజుకోవడం సానుకూల అంశమని నివేదిక వివరించింది. ప్రపంచ ఫార్మా పరిశ్రమలో భారత్ ఔషధ రంగం వాటా 3.1 నుంచి 36 శాతం, వాల్యూమ్ పరంగా చూస్తే 10 శాతం ఉంది. 2025 సంవత్సరం నాటికి దేశీయ ఫార్మా వృద్ధి 100 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశముందని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ నివేదిక అంచనా వేస్తోంది.

Comments

comments