Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

ఫార్మాగ్నెట్ హైదరాబాద్

పారిశ్రామిక వేత్తలకు ఆకర్షణగా మారిన ఫార్మాసిటీ, పెట్టుబడుల గమ్యంగా తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు, ఐటిలో హైదరాబాద్ తర్వాత వరంగల్: సమీక్షా సమావేశంలో సిఎం

kcrహైదరాబాద్: పెట్టుబడులకు అవకాశాలు ఉన్న ప్రాంతంగా హైదరా బాద్‌ను, తెలంగాణను ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నా రని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానాలు, ప్రణాళి కలు, కార్యాచరణ అందుకు అనుగుణంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. సిఎం క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం ఫార్మాసిటీ, ఔటర్ రింగ్ రోడ్, ఐటి, టెక్స్‌టైల్ పార్కు తదితర అంశాలపై సమీక్ష జరిపారు. ఐటి మంత్రి కె. తారకరామారావు, సిఎంఒ ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికు మారి, ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, సిఎం అదనపు ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరు లు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో నెలకొల్పాలనుకునే ఫార్మాసిటీ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉం దన్నారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ ఫార్మా కం పెనీలతో పాటు చిన్న చిన్న కంపెనీలు కూడా హైద రాబాద్‌లో ఫార్మా పరిశ్రమలు నెలకొల్పడానికి ముం దుకు వస్తున్నాయని చెప్పారు. ఫార్మాసిటీలో భాగం గానే నివాస ప్రాంతాలు, కామన్ ట్రిట్‌మెంట్ ప్లాంట్లు ఉండాలన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో కామన్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు ఎలా పని చేస్తున్నాయో అధ్యయనం చేయాలని, పాలిడ్‌వేస్ట్‌లో వస్తున్న కొత్త ధోరణులను కూడా పరిశీలించాలని సిఎం చెప్పారు. మానవాళికి ఔషధాల అవసరం ఎక్కువవుతున్న నేపథ్యంలో ఫార్మా పరిశ్రమ మరింత విస్తరిస్తుందని సిఎం అంచనా వేశారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు హైదరాబాద్ అనువైన ప్రాంతంగా అందరూ గుర్తించారన్నారు. పరి శ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం సృష్టించిందని ప్రధాన మంత్రి స్థాయి వారు కూడా మాట్లాడడం సాధారణ విషయం కాదని సిఎం అన్నారు. పరిశ్రమలు, ఐటి కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రొత్సాహం, సహకారాన్ని మరింత విస్తృ తంగా ప్రచారం చేయాలని సిఎం చెప్పారు. ఐటి రంగం కూడా తెలంగాణలో బాగా విస్తరిస్తున్నద న్నారు. ఐటి పరిశ్రమలను ప్రొత్సహించడానికి ప్రభు త్వం తరఫున ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిం చాలని సిఎం చెప్పారు.
దేశవ్యాప్తంగా ఐటి పరిశ్రమల ఏర్పాటుకు బెంగ ళూరు, హైదరాబాద్ నగరాలే సరైన వని అందరూ గుర్తిస్తున్నారన్నారు. ఇటీవల సంభవించిన పెను తుఫాను ప్రభావం వల్ల చెన్నై నుండి కూడా కొన్ని కంపెనీలు వెనక్కి మళ్లుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరం తనపై ఉన్న అంచనాలను నిలబె ట్టుకోవడానికి ప్రభుత్వం తరపున తగు చర్యలు తీసుకోవాలన్నారు. పెట్టుబడు లను ప్రొత్సహించేందుకు అవసరమైన పూర్వ రంగాన్ని సిద్ధం చేయాలని సిఎం కెసిఆర్ అధికారులకు సూచించారు. ఆర్థికంగా బలంగా ఉన్న పరిస్థితిని అను కూలంగా మార్చుకుని ఐటి రంగానికి ప్రొత్సాహం అందించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హైదరాబాద్‌లోని జీనోం వ్యాలీలో వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, టి హబ్ కూడా మంచి ఫలితాలనిస్తున్నదన్నారు. ఈ కారణంగా ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ బ్రాంచ్ ఆఫీసులను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాయన్నారు. హైదరాబాద్ తరువాత వరంగల్‌లో కూడా ఐటి రంగం విస్తరణకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. వరంగల్‌లో అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కు రాబోతున్నదని దీని వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని సిఎం పేర్కొన్నారు. పరిశ్రమలు, ఫార్మాసిటి, ఐ టి కంపెనీలు, టెక్స్‌టైల్ పార్కు తదితర ఉపాధి కల్పన కార్యకలాపాల వల్ల తెలం గాణ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతుందని, హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో కూడా రవాణా వ్యవస్థపై ప్రభావం ఉంటుందన్నారు. దీనిని దృ ష్టిలో పెట్టుకుని మెరుగైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఎక్కడెక్కడ ఔటర్ రింగ్ రోడ్లు రావాలో ప్రణాళికను సిద్ధం చేయాలని సిఎం చెప్పారు. తెలం గాణ రాష్ట్రంలో కేవలం ఆరు నెలల కాలంలోనే తాము పరిశ్రమ స్థాపించి ఉత్ప త్తి ప్రారంభించగలిగామని ఈ ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారం వల్ల నే సాధ్యమయిందని మైక్రోమ్యాక్స్ కంపెనీ యాజమాన్యం పేర్కొంది. ఈ మేర కు వారు పంపిన సందేశాన్ని ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ముఖ్యమంత్రికి వివరించారు. ‘ప్రభుత్వం తెచ్చిన సరళమైన, పారదర్శకమైన నూతన పారిశ్రా మిక విధానం వల్ల తాము ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే పనులు చేసుకోగలిగాం. ఉత్తరాఖండ్‌లో ప్లాంట్ ప్రారంభించడానికి రెండున్నర ఏళ్లు పడితే తెలంగాణలో కేవలం ఆరు నెలల్లోనే పూర్తయింది” అని మైక్రో మ్యాక్స్ పేర్కొందన్నారు.

Comments

comments