Home వార్తలు ఫోటోగ్రఫి అంటే పిచ్చి…

ఫోటోగ్రఫి అంటే పిచ్చి…

surya1ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దారనేర్పించగన్…? అన్నట్లుగా నేర్పించేవారు,ప్రోత్సహించేవారు ఉంటే మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతారన్నది వాస్తవం.సినిమాలు చూసి ఫ్రేమింగ్,సినిమాటోగ్రఫి మీద ఏర్పడిన ఆసక్తిని తన వృత్తిగా మలుచుకున్న నీలం సుభాషిణి జీవకళ ఉట్టిపడేలా ఫోటోలు తీస్తున్నారు.ఏ కోర్సు చేయకుండా కేవలం యూట్యూబ్‌లో విడియోలు చూసి ఫోటోగ్రఫిని నేర్చుకున్న హైదరాబాద్‌కు చెందిన ఈ యువతి నేటి మన యువతరంగం…

సినిమాలు చూసి-హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన సుభాషిణి చిన్నప్పటినుండి అన్ని భాషల సినిమా లను ఇష్టంగా చూసేవారు. సినిమాల్లోని సీనరీని ఇష్టపడే తను ఫ్రేమింగ్, సినిమాటోగ్రఫీపై దృష్టి పెట్టారు. సినిమాల్లో వచ్చే ప్రతి ఫ్రేంను జాగ్రత్తగా గమనించేవారు.సుభాషిణి భర్త సినిమా డైరెక్టర్(హృదయ కాలేయం) స్టీవెన్ శంకర్ అలియాస్ సాయి రాజేష్ వృత్తికూడా తన ఇష్టాన్ని ప్రోత్సహిం చేదిగా ఉన్నందున మరింత ముందుకు వెళ్ళారు సుభాషిణి.
యూ ట్యూబ్ విడియోల ద్వారా- బి కాం చదివిన సుభాషిణికి ఫోటోగ్రఫి అంటే ఉన్న ఇష్టం ఖాళీగా కూర్చోని వ్వలేదు.సమయం దొరికి నప్పుడల్లా యూ ట్యూబ్‌లో ఫోటోగ్రఫికి సంబం ధించిన వీడియోలు చూస్తూ తన ఆకాంక్షకు మరింత మెరుగులుదిద్దు కున్నారు.ఒక చిన్న కెమెరాతో మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగారు సుభాషిణి.
ప్రోఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా- గత మూడు సంవత్సరాలుగా ఈవెంట్స్ చేస్తూ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా ఎదిగారు. బర్త్‌డేస్,పెళ్ళిళ్ళు వంటి ఏ కార్యక్రమమైనా నేడు అవలీలగా జీవకళ ఉట్టిపడే ఫోటోలను తీస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు సుభాషిణి.ఈవెంట్స్ చేస్తున్న సుభాషిణిని 9030089337 నెంబర్లో సంప్రదించి తన ఫోటోగ్రఫీ సేవలను వినియోగించుకోవచ్చు.ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా ఎదగాలనుందంటున్న సుభాషిణికి ఆల్ ద బెస్ట్ చెబుదామా మరి.