Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఆల్ఫాబెట్ బోర్డు డైరెక్టర్లలో చేరిన పిచాయ్

Google-CEOసాన్ ప్రాన్సిస్కో: సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ బోర్డు డైరెక్ట ర్లలో ఒకరిగా నియమితులయ్యారు. భారత సం తతికి చెందిన పిచాయ్ బోర్డులో చేరడం పట్ల  కాలిఫోర్నియాకు చెందిన అమెరికా బహుళజాతి సంస్థ ఆల్ఫాబెట్  సిఇఒ లారీ పేజ్ ఆనందం వ్య క్తం చేశారు. గూగుల్ సిఇఒగాఐ సుందర్ గొప్ప సేవలందిస్తున్నారని, ఆయన సారథ్యంలో అద్భు తమైన ఆవిష్కరణలు వస్తున్నాయని, ఆల్ఫాబెట్ బోర్డులో ఆయన చేరిక తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫా బెట్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడిగా నియమి తులవడంతో భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ మరో ఘనత సాధించారు. తమిళనాడు లోని చెన్నైలో జన్మించిన 45 ఏళ్ల పిచాయ్ ఐఐటి ఖరగ్‌పూర్‌లో చదివారు. దీర్ఘకాలంగా ఆయన గూగుల్ సేవలందిస్తున్నారు. 2004లో గూగు ల్‌లో చేరిన ఆయన సంస్థలో వివిధ విభాగాల్లో బాధ్యతలు నిర్వహించారు. గూగుల్ వ్యవస్థాప కులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌తో కలిసి పనిచేశారు. 2015 ఆగస్టులో గూగుల్ సిఇఒగా బాధ్యతలు చేపట్టిన సుందర్ నేతృత్వంలో కీలక అడ్వ ర్టైజింగ్, యూట్యూబ్ బిజినెస్ అమ్మకాలు బాగా పెరిగాయని సంస్థ పేర్కొంది. మెషిన్ లెర్నింగ్, హార్డ్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో పెట్టుబడులు కూడా పెరిగాయి. 26 బిలియన్ డాలర్ల అమ్మకా లపై 3.5 బిలియన్ డాలర్ల నికర ఆదాయం  సాధించినట్టు తెలిపింది.  అలాగే యూరోపి యన్ యూనియన్ విధించిన  యాంటీ ట్రస్ట్ ఫైన్ (2.7 బిలియన్ డాలర్లు) లేకపోతే రికార్డ్ స్థాయి భారీ లాభాలను సాధించేవారమని పే ర్కొంది.  ఆల్ఫాబెట్ సంస్థ సోమవారం ప్రకటిం చిన త్రైమాసిక  ఫలితాల్లో ఆదాయంలో 21 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గూగుల్ ప్రకటన ఆదాయం 18.4 శాతం పెరిగి 22.67 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు ఈ ఏడా ది ప్రపంచవ్యాప్తంగా సంస్థ  డిజిటల్ యాడ్ రెవెన్యూ 73.75 బిలియన్ డాలర్లుగా నమోదు కానుందని  అంచనా వేస్తున్నారు.

Comments

comments