Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

కళ్లముందు కదలాడిన ‘ధింసా’

Dance-in-Tribes

మహబూబాబాద్ ప్రతినిధి: ఆయన కళ్ళకు కనిపించి తాను మెచ్చిన సీన్‌ను క్లిక్‌మనిపిస్తే చాలు అది జాతీయస్థాయిలో రాణించాల్సిందే, అవార్డు దక్కాల్సిందే! ఇప్పటికే పలు మార్లు ఫోటోగ్రఫీలో జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైన మానుకోటకు చెందిన పిల్లి సతీష్ తీసిన ఫోటో ఫ్రేమ్ మరో మారు జాతీయస్థాయ అవార్డు ఎంపికై పలువురి ప్రసంశలు అందుకుంది. డిసెంబర్ 27 నుండి 29 వరకూ ఖమ్మం జిల్లా పాపికొండల్లో ఖమ్మం ఫోటో ఆర్ట్ నిర్వహించిన జాతీయస్థాయి ఫోటోగ్రఫి తరగతుల్లో దేశవ్యాప్తంగా 150మంది ఫోటో గ్రాఫర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన స్టిల్ ఫోటో గ్రాఫర్ పిల్లి సతీష్ తన కెమెరాలో బంధించిన సాంప్రదాయ గిరిజన నృత్యం ‘ధింసా’ ఫోటో చిత్రం ఈనెల 30న ఖమ్మంలో జరిగిన జాతీయస్థాయి ఫోటో వర్క్‌షాప్‌లో ఉత్తమ ఫోటో చిత్రంగా ఎంపికైంది. ఈమేరకు ఈ అవార్డును నవలా రచయిత రావులపెల్లి సునీత, బాంబే కార్పోరేట్ ఫోటోగ్రాఫర్ శిరీష్ కరేలి, ఎపి అకాడమి కార్యదర్శి తమ్మ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అవార్డు ప్రసంశాపత్రంతోపాటు రూ.5000లు ప్రోత్సాహకాన్ని అందుకున్నాడు.

ఖమ్మం ఫోటో అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షులు రాజేష్, కార్యదర్శి నాగరాజు తదితరుల పర్యవేక్షణలో ఈ అవార్డు అందించారు. గతంలో పిల్లి సతీష్ పలు జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. అంతర్జాతీయ గౌరవం కూడా ఆయనకు లభించింది. ఆయన చిత్రీకరించిన ఫోటోలు హైద్రాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంలో జరిగిన ఫోటో ఎగ్జిబిషన్లో ప్రదర్శిచడం జరిగింది. పిల్లి సతీష్‌కు జాతీయ ఫోటో వర్క్‌షాప్‌లో అవార్డు రావడం పట్ల మహబూబాబాద్ ఫోటో గ్రాఫర్ అసోసియేషన్, పట్టణ ప్రముఖులు ఆయనను అభినందించారు.

Photo3

Comments

comments