Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

పైలట్ ప్రాజెక్టు సక్సెస్

 Pilot project success Joint Nallagonda District

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధిః ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆంధ్ర పాలకుల వివక్ష నుంచి బయటపడి తెలంగాణ ప్రభుత్వ చేదొడువాదోడుతో రైతన్న చీకటికష్టాల నుంచి బయటపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక విద్యుత్ మోటారు కనెక్షన్‌ల కలిగిన జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా. అన్నదాతను అన్ని విధాలా ఆదుకుంటున్న టిఆర్‌ఎస్ ప్రభు త్వం నిరంతర విద్యుత్ సరఫరా చేయడం ద్వారా మరింత వెన్నుదన్నుగా నిలవాలని గతేడాది సంకల్పించిన రాష్ట్ర ప్రభుతం 24గంటల నిరంతర విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా తొలుత మెదక్ జిల్లాలో అమలుపర్చేందుకు నిర్ణయించిన ప్రభుత్వం విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఉమ్మడి నల్లగొండ జిల్లాను సైతం పైలట్ ప్రాజెక్టులో చేర్చారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి, సాక్షాత్తూ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండలో కూడా గత సంవత్సరం జూలై18వ తేదీన అర్ధరాత్రి 12గంటల సమయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి జన్మదిన కానుకగా అమలులోకి తీసుకొచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలో భాగంగా నల్లగొండ జిల్లాలో లక్షా79, 809, సూర్యాపేటలో లక్షా 21189, యాదాద్రి భువనగిరి జిల్లాలో 91వేల 066 మొత్తం 3లక్షల 92వేల 054 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు సంబంధించి రైతాంగానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ద్వారా లబ్దిచేకూరింది. సమైఖ్యపాలనలో ఇటు గృహావసరాల వినియోగదారులు, అటు వ్యవసాయ వినియోగదారులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన విద్యుత్ సమస్యను పూర్తి ప్రాలదోలి గృహావస రాలకు నిరంతరం, నిరాటంకటంగా విద్యుత్ సరఫరా చేసి చరిత్ర సృష్టించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనతికాలంలోనే వ్యవసాయానికి కూడా 24గంటల నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లోనే ప్రకటించారు.ఆ మేరకు మెదక్, నల్లగొండ జిల్లాలను ప్రయోగాత్మక ప్రాజెక్టు జిల్లాలుగా ఎంపిక చేసి విజయవంతంగా అమలు చేయడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 972 11కె.వి. వ్యవసాయ ఫీడర్ల ద్వారా
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాధ్రి భువనగిరి జిల్లాల 3సర్కిళ్ళ పరిధిలో నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, యాదాధ్రి భువనగిరి, దేవరకొండ, హుజూర్‌నగర్ తదితర డివిజన్‌ల వారిగా 972 11కె.వి ఫీడర్‌ల ద్వారా 3లక్షల 92వేల 54 వ్యవసాయ విద్యుత్ కనెక్ష న్‌లు ఉన్నాయి. వీరందరికి 24గంటల ప్రయోగాత్మక విద్యుత్ సరఫరా విజయవంతం కావడంతో ఇటు రైతన్నల్లో, అటు అధికారం పార్టీ నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో మంత్రి జగదీష్‌రెడ్డి జన్మదిన కానుకగా అమలులోకి వచ్చిన నిరంతర విద్యుత్ సరఫరా విధానం 24గంటల్లో అద్బుత ఫలితాలు రావడం, దాంతో 2017 జూలై 18అమలులోకి వచ్చిన 24గంటల విద్యుత్ 2018 జూలై 18వరకు సంవత్సరం కాలం పూర్తి చేసుకుంది. ఈ ఏడాది పాటు నిరంతర విద్యుత్ సరఫరాలో ఆశించిన మేర సత్పలితాలు సాధించడంతో శుభపరిణామం. ఏడాది కాలం అక్కడక్కడా కొన్ని అవాంత రాలు ఎదురైనా ఆ తర్వాత సర్దుబాటు కావడంతో ఆయా సమస్యలకు తెరపడి దేదీప్యమానంగా వెలుగొందుతోంది.

Comments

comments