Home వార్తలు గులాబీ శకానికి  నేడే నాంది

గులాబీ శకానికి  నేడే నాంది

ballఅడిలైడ్ : టెస్టు క్రికెట్‌లో ‘గులాబీ’ శకం నేడు ప్రారంభంకానుంది. సంప్ర దాయ టెస్టు క్రికెట్‌కు మరింత ప్రేక్షకాదరణ కల్పించడంలో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తొలిసారి డే నైట్ టెస్టులకు తెరలేపుతున్నారు. దీనిలో భాగంగా మ్యాచ్‌లో తొలిసారి గులాబీ(పింక్) రంగు బంతిని వాడుతున్నారు. మొదట్లో డేనైట్ మ్యాచ్‌లను నిర్వహించడాన్ని కొందరు విమర్శిస్తు వచ్చినా ఐసిసితో పాటు దిగ్గజ ఆటగాళ్లు కపిల్‌దేవ్, గవాస్కర్, చాపెల్ ద్వయం, మియాందాద్ తదితరులు స్వాగతించారు. కాగా మ్యాచ్ మధ్యాహ్నం ఒక గంటకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. మధ్యలో 4 గంటలకు టీ బ్రేక్, 6.30 గంటలకు డిన్నర్ బ్రేక్ ఉంటాయి. 138 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో డేనైట్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా 1997లోనే తమ దేశవాళీ క్రికెట్‌లో భారత్ డేనైట్ మ్యాచ్‌ను నిర్వహించింది. ఆ సీజన్ రంజీట్రోఫీలో ముంబయి, ఢిల్లీ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను బిసిసిఐ డేనైట్ మ్యాచ్‌గా నిర్వహించింది. అయితే ఆ తరువాత బిసిసిఐ ఈ తరహా మ్యాచ్‌లు నిర్వహించలేదు.