Home వనపర్తి పోలీసులా..? టిఆర్‌ఎస్ కార్యకర్తలా..!

పోలీసులా..? టిఆర్‌ఎస్ కార్యకర్తలా..!

పోలీస్‌స్టేషన్‌కు గులాబి రంగు వేయడంపై

ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి ధర్నా

Police-Station-Colour

ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు ఇటీవల పోలీసులు పెయింటింగ్ వేశా రు. అందులో టిఆర్‌ఎస్ కలర్ పోలీస్‌స్టేషన్ కు వేయడంపై మనస్సు నొచ్చుకున్న ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలతో కలిసి శుక్రవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్ గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు టిఆర్‌ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు టిఆర్‌ఎస్ కలర్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు యూనిఫాం వదిలి టిఆర్‌ఎస్ కండువలు మెడలో వేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేష్, రామకృష్ణారెడ్డి, విజయ్‌కుమార్, నరేందర్‌గౌడ్ , నర్సింహ్మ ,సుంకరి ఆంజనేయులు ,ధనలక్ష్మీ, తిరుపతయ్య, సుదర్శన్, ఎండి బాబా, తదితరులు ఉన్నారు.