Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

పైరసీ సీడీల తయారీ ముఠా గుట్టురట్టు

CDవిజయవాడ : పైరసీ సీడీల ముఠాను విజయవాడ నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ వన్‌టౌన్‌లోని కొత్తపేట డ్రెయిన్ వీధిలో పైరసీ సీడీల తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో సుమారు ఐదు వేల పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో తాజాగా విడుదలైన జతకలిసే సౌఖ్యం సినిమాలతో పాటు బెంగాల్ టైగర్, శంకరాభరణం తదితర చిత్రాలకు చెందిన పైరసీ సీడీలు ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న సినిమాలకు సంబంధించిన సీడీ కవర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈకేసులో పైరసీ సీడీల నిర్వాహకుడు టి. సురేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Comments

comments