Home దునియా లీనింగ్ టవర్ ఆఫ్ పీసా

లీనింగ్ టవర్ ఆఫ్ పీసా

Pisa Tower

ప్రపంచ వింతల్లో ఒకటైన పీసా టవర్ ఉండేది ఇటలీలోని పీసా నగరం. 1173లో ఈ టవర్‌ను కట్టడం ప్రారంభించారు. పూర్తి నిర్మాణానికి సుమారుగా 200 ఏళ్లు పట్టింది. ఈ టవర్ కాస్త ఒరిగిపోయి ఉంటుంది. అందుకే లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అని పిలుస్తుంటారు.
పీసా గోపురం ఎత్తు ఓ వైపు 185.93 అడుగులుంటే, అవతలి వైపు 183.27 అడుగులుంటుంది. దీని మొత్తం బరువు 14,500 టన్నులు. ఎనిమిది అంతస్తులతో ఉండే ఈ టవర్‌లో మొత్తం 296 మెట్లు ఉన్నాయి. ఇదో మంచి సందర్శక ప్రాంతం. దేశవిదేశాల నుంచి ఏటా పది లక్షలకుపైగా పర్యటకులు వస్తుంటారు. 1178 నుంచి ఇది చాలా నెమ్మదిగా ఒరిగిపోవడం మొదలైంది. ఎందుకంటే మూడు మీటర్ల లోతుగానే వేసిన పునాది గట్టిగా లేకపోవడం, ఆ స్థలంలోని మట్టి స్వభావాల వల్ల ఆ తర్వాత యుద్ధాల కారణంగా వందేళ్లు దీని నిర్మాణం ఆగిపోయింది.

1272 లో పనిమొదలైంది. ఈ సమయంలో మట్టి కుదురుకుంది. ఆపై అంతస్తులను ఒక వైపు ఎత్తుగాను, మరోవైపు తక్కువగాను కడుతూ వచ్చారు. అందువల్ల టవర్ కొంత వంకరగా కూడా కనిపిస్తుంది. 1284లో మళ్లీ యుద్ధం వల్ల పనులు ఆగిపోయాయి. 1319లో ఏడో అంతస్తును పూర్తి చేశారు. 1372లో గంటలుండే బెల్ ఛాంబర్‌ను నిర్మించారు. అప్పటి నుండి ఎన్నో సార్లు ఇది ఒరిగిపోకుండా ఆపాలని ప్రయత్నాలు చేశారు. ఈ గోపురాన్ని కట్టడానికి కారణం యుద్ధాల్లో సాధించిన విజయాలైతే, ఇంత ఆలస్యం కావడానికి కారణం కూడా యుద్ధాలే. 1864లో ఇటలీ కోరికపై ఎన్నో దేశాల నుంచి ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు కలిసి రక్షణ చర్యల గురించి చర్చించటం మొదలు పెట్టారు.

అంటే దీన్ని కట్టడానికి 200 ఏళ్లు పడితే కదలకుండా ఉంచడానికి దాదాపు 800 ఏళ్లకాలం పట్టిందన్నమాట. రెండు దశాబ్దాల తర్వాత 1990లో పనులు మొదలై 2001కి ఒక కొలిక్కి వచ్చాయి. ఒకప్పుడు సుమారు 5.5 డిగ్రీల వరకు వాలిపోయిన గోపురం అంచు ఇప్పుడు 3.97 డిగ్రీల కోణం వరకు వచ్చి నిలిచింది.  ఒరిగిపోతున్న దిశకు వ్యతిరేక దిశలో భూమిలోకి 800 టన్నుల సీసం పోసి బరువు పెట్టారు.

ఇందుకోసం పీసా టవర్ కింద నుంచి 70 టన్నుల మట్టిని ఆధునిక యంత్రాల ద్వారా గొట్టాలతో జాగ్రత్తగా తవ్వారు. దాని జాగాలో సిమెంటును నింపారు. పీసా టవర్‌ను కదలకుండా చేయడానికి పదేళ్లు గట్టిగా ప్రయత్నించారు. దాదాపు 160 కోట్ల రూపాయలు ఖర్చయ్యింది. పీసా టవర్ కట్టిన ప్రాంతంలో క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం ఒక నది ప్రవహించేదనీ అందుకే అక్కడి నేల గుల్లగా ఉందనీ అంటారు.

 

Pisa Tower History in Telugu