Home వరంగల్ రూరల్ స్థలం ఆక్రమించారని ట్యాంక్ ఎక్కిన వ్యక్తి

స్థలం ఆక్రమించారని ట్యాంక్ ఎక్కిన వ్యక్తి

Suicide1

నర్సంపేట:తన స్వంత భూమి అక్రమంగా కొందరు ఆక్రమించుకున్నారని ఆత్మహత్య చేసుకోవడానికి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నర్సంపేట పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన జడల వెంకటేశ్వర్లుకు చెందిన నాలుగు గుంటల ఇంటి స్థలాన్ని గత రెండు సంవత్సరాల క్రితం కొందరు ఆక్రమించుకొని అందులో షెడ్డువేసి వాటర్ ప్లాంట్ పెట్టారని తెలిపారు.

అతనికి ఉండబడిన ఆ ఇంటి స్థలంపై పలుమార్లు నగరపంచాయతీ అధికారులు దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోలేదని తెలిపారు. కోర్టులో కేసు కేసి వేసిఆక్రమణదారులు నిర్మాణం చేపడుతున్న కట్టడాలు ఆపాలని నోటీసులు పంపినా చంపి వేస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయాడు. నగరపంచాయతీ కమిషనర్ మల్లిఖార్జునస్వామి, ఎస్సై రాజువర్మ, కౌన్సిలర్ పాలాయి శ్రీను, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లక్ష్మన్, రుద్ర ఓం ప్రకాష్ తదితరులు వచ్చి వెంకటేశ్వర్లుకు సర్థి చెప్పి ట్యాంక్ దింపించారు. అనంతరం అతనికి న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు తెలిపారు.