Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

సముద్రంలో కూలిన విమానం

AIRCRAFT

ఐవరీ కోస్ట్ : సరుకులతో వెళుతున్న ఓ కార్గో విమానం సముద్రంలో కూలింది. ఈ ప్రమాదంలో విమాన పైలట్‌తో పాటు మరో నలుగురు చనిపోయినట్టు తెలిసింది. ఈ ఘటన పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఐవరీకోస్ట్‌లో శనివారం జరిగింది. అబిజాన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే సముద్ర తీరంలో కూలింది. ఫ్రెంచ్ ఆర్మీ కోసం సరుకులు తీసుకెళుతుండగా విమానం ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. ఈ విమాన ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ భారీ వర్షం పడుతోంది. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.

Plane crashed into the sea

Comments

comments