Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

త్రుటిలో తప్పిన ప్రమాదం..

 Plane skids off the runway in Kochi

కొచ్చి: 306 మంది ప్రయాణికులతో ఖతార్లోని దోహ నుంచి కొచ్చి వచ్చిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పిన ఘటన కొచ్చి లో చోటు చేసుకుంది . ల్యాండ్ అయ్యే సమయంలో రన్ వే పై విమానం జారింది.  ఇది గమనించిన విమాన పైలెట్లు ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానాన్నిచాకచక్యంగా ల్యాండ్ చేశారు. వర్షం కారణంగా రన్ వే బాగా తడిసి నీరు ఉండటంతో విమానం ల్యాండ్ అయ్యే సమయంలో కొంచెం పక్కకు జారినట్లు అధికారులు తెలిపారు.  ఈ ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనను ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ ధ్రువీకరించింది.

 

Comments

comments