Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

నాసా శాస్త్రవేత్తలు కనిపెట్టిన ప్లానెట్

nasa

హూస్టన్: మనం ఊహిస్తున్నట్లే ప్లానెట్ నైన్ ఉందని నాసా రుజువుచేసింది. భూమి కంటే 10 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి, సూర్యుని నెప్ట్యూన్ ఉన్న దూరం కంటే 20 రెట్లు ఎక్కువ దూరంగా ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. మన సౌరకుటుంబం నుంచి మిస్ అయిన సూపర్ ఎర్త్‌గా ఈ ప్లానెట్ ను పిలుస్తున్నారు. ఇది భూమి కంటే ఎక్కువ ద్రవ్యరాశి కలగి ఉన్నా, యురేనస్, నెప్ట్యూన్ కంటే చిన్నదే అని నాసా తెలిపింది. సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతానికైతే ఆ గ్రహం నుండి పరోక్ష సంకేతాలు అందుతున్నాయని ఊహగానలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్లానెట్ నైన్ ఉందనడానికి 5 రకాల ఆధారాలు ఉన్నాయని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆస్ట్రోఫిజిసిస్ట్ కొన్‌స్టాన్‌టిన్ బేటిగిన్ తెలిపారు. ప్లానెట్ నైన్ ఉండొచ్చేమోగానీ..నిబిరు పేరుతో భూమికి ప్రమాదం పొంచి ఉందన్న వాదనలు మాత్రం ఆధార రహితమని శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు.

Comments

comments