Home భద్రాద్రి కొత్తగూడెం ఫ్రూనింగ్‌పై ప్లానింగ్ ఏది?

ఫ్రూనింగ్‌పై ప్లానింగ్ ఏది?

Leaf-Collection

భద్రాచలం : గిరిజనుల వేసవి పంటైన తునికాకు ఫ్రూనింగ్ పనులు ఇంకా మొదలు కానేలేదు. వేసవిలో ఆదాయం సమకూర్చే తునికాకు సేకరణకు వారు మక్కువ చూపుతుంటారు. దేశంలోనే అత్యంత నాణ్యమైన ఆకు లభించే భద్రాచలం అడవుల్లో అందుకు సంబంధించిన పనులు మొదలు పెట్టాల్సి ఉన్నప్పటికీ ఇంకా పూనుకో లేదు. ఫ్రిబవరి నెలాఖరు నాటికి తునికాకు ఫ్రూనింగ్ (మండకోట్టడం) పనులు పూర్తి చేస్తే ఆకు సేకరించే సమయానికి నాణ్యమైన అకు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. భద్రాచలం నార్త్ అటవీ క్షేత్రం పరిధిలో ప్రస్తుతం మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. ఈ
యూనిట్ల ద్వారా లక్షాల మేరకు ఆకు సేకరణ ప్రతీ ఏటా జరుగుతుంది. ఈ ఏడాది 14850 స్టాండార్డ్ బ్యాగుల ఆకు సేకరణ చేసేందుకు టెండర్లు పూర్తి చేశారు. తుని కాకు ఫ్రూనింగ్ పనులు సత్వమరే చేపట్టాలని పలువురు గిరిజనులు కోరుతున్నారు.

టెండర్లు పూర్తి…

భద్రాచలం నార్త్ అటవీ క్షేత్రంలో ఉన్న 5 యూనిట్లలో ఆకు సేకరణ కోసం 2016 డిసెంబర్ 15,16 తేదీల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. మొత్తం 14850 స్టాండార్డ్ బ్యాగుల ఆకు సేకరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆర్లగూడెం యూనిట్ లో 5100 బ్యాగులు, కొమ్మనాపల్లి యూనిట్‌లో 950, చర్ల యూనిట్‌లో 1900, దేవరాపల్లి యూనిట్లో 4400, దుమ్ముగూడెం యూనిట్‌లో 2500 స్టాండార్డ్ బ్యాగుల ఆకు సేకరణ చేయాల్సి ఉంది. ఇందులో కొమ్మ నాపల్లి, దుమ్ముగూడెం యూనిట్లను ఎండి రావూఫ్ అనే సంస్థ టెండర్ దక్కించుకోగా, ఆర్లగూడెం, దేవరపల్లి, చర్ల
యూనిట్లను ఎస్యూరెన్స్ కంపెనీ దక్కించుకుంది. కానీ అటవీ అధికారులు మండకొట్టేందుకు పనులు పూరమా యించాల్సి ఉంది. గిరిజనులకు ఆదాయాన్ని సమకూర్చే వేసవి పంట తునికాకు సేకరణపై అటవీశాఖాధికారులు దృష్టి సారించి సకాలంలో పనులు పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఐదేళ్ల బోనస్‌ను చెల్లించేలా చర్యలు తీసు కోవడంతో పాటు 50 ఆకుల కట్ట ధర పెరిగేలా చూడాలని గిరిజనులు కోరుతున్నారు.

అర కోరగానే ఆకుల కట్ట ధర ….

వేసవిలో ఆదాయాన్ని సమకూర్చుకుని ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడిపేందుకు తునికాకు సేకరణ గిరిజనులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఆకు సేకరణ చేస్తే 50 ఆకుల కట్టకు ఇచ్చే ధర మాత్రం అరకొరే.
గతంలో 50 ఆకుల కట్టకు రూ.1.20 పైసలు మాత్రమే చెల్లించారు. అయితే గత ఏడాది కేవలం 9 పైసలు మాత్రమే పెంచారు. తునికాకు టెండర్లు పూర్తయినప్పటికీ ఈ ఏడాది ధర ఇంకా నిర్ణయిం చలేదని ఆ శాఖాధికారులే చెబుతున్నారు. ఇందులోనూ గాలికట్టల దోపిడీ ఉంటుంది.
పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో పోలిస్తే గిరిజనులకు 50 ఆకుల పై చెల్లించే ధర నామమాత్రమనే చెప్పాలి. గాలికట్టల పేరుతో అదనపు ఆకుల కట్టల దోపిడీని అరికట్టి, 50 ఆకుల కట్టకు గిట్టు బాటు ధర కల్పించేలా, ఆకు సేకరణ సమయంలో ప్రమాదాల కు గురయ్యే వారికి పరిహారం పెంచి చెల్లించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని పలు రాజకీయ పార్టీల నాయకులతో పాటు గిరిజన సంఘాలు కోరుతున్నాయి.

బోనస్ చెల్లింపుల్లో బొక్క బోర్లా…

పలు ఆందోళనలు, నిర్వహించిన అనేక పోరాటాల ఫలితంగా ప్రభుత్వం అప్పట్లో బోనస్ చెల్లించేందుకు ముందుకు వచ్చింది. దీంతో గిరిజనుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కానీ 2012 నుంచి 2016వ సం. వరకు గిరిజనులకు దక్కాల్సిన తునికాకు బోనస్ రూ.30 కోట్లుకు పైగా చెల్లించాల్సి ఉన్నట్లు తెలిసింది. 2012 నుంచి సేకరించిన తునికాకు అమ్ముడు పోకపోవడం వల్లే బోనస్ చెల్లింపులు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. మండుటెండలో ప్రాణాలకు సైతం తెగించి ఆకు సేకరణ చేసే గిరిజనులకు దాని ద్వారా బోనస్ పోందే అవకాశం ఉన్నప్పటికీ
ప్రభుత్వాలు మాత్రం చెల్లింపు చేసే విషయంలో బొక్కబోర్లా పడుతున్నాయి. వెరసి అమాయక గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతోంది.  ఉనికి కోల్పోతున్న

నార్త్ డివిజన్ …

భద్రాచలం అటవీశాఖ పరిధి నానాటికీ తగ్గిపోతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సౌత్ డివిజన్ మొత్తం ఆంధ్రప్రదేశంలో కలిసి పోవడంతో అటవీ క్షేత్ర పరిధి తగ్గిపోయింది. దీంతో ఇక్కడున్న సౌత్ అటవీ శాఖ కార్యాలయ సిబ్బందిని, రికార్డులను బదలా యించారు. దీంతో భద్రాచలం కేంద్రంగా కేవలం నార్త్ డివిజన్ కార్యకలాపాలు మాత్రమే సాగుతున్నాయి. ఇప్పుడు కొత్త జిల్లాల నేపధ్యంలో నార్త్ డివిజన్ పరిధిలో గల వెంకటాపురం, వాజేడు మండ
లాలు భూపాలపల్లి జిల్లాలో కలిసిపోవడంతో పరిధి ఇంకా కుదించుకుపోయింది. అప్పట్లో 9 తునికాకు యూనిట్లు ఉండగా, ఇప్పుడు కేవలం ఐదు మాత్రమే మిగిలాయి. అటవీ క్షేత్ర పరిధి క్రమక్రమంగా కుదించుకుపోవడంతో డిఎఫ్‌ఓ స్థాయి అధికారులు ఎవ్వరూ ఇక్కడ పనిచేసేందుకు మొగ్గు చూపడం లేదని పలువురు బాహాటంగానే చర్చింకుంటున్నారు. ప్రస్తుతం భద్రాచలం నార్త్ డివిజన్ ఇంచార్జ్ పాలనలోనే కొనసాగుతుండటం గమనార్హం.