Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మొక్కలను సరియైన స్థానంలో నాటండి

citronella-plant_manatelang copyచాలా మంది ఇంట్లో మొక్కలను నాటుకుంటారు. అయితే వాటిని నాటేటప్పుడు భవిష్యత్తు గురించి అంతగా ఆలోచించం. ఆ మొక్కలు నేలలో కుదురుకున్నాక వాటి గురించి మరిచిపోతాం. కొంత కాలానికి అవి పెద్దవైపోతాయి. అప్పుడు కాంపోండ్ వాల్, సెప్టిక్ ట్యాంక్, బేస్‌మెంట్‌లోకి మొక్కల వేర్లు వెళుతాయి. ఇవి ఇంటి పునాదులకు, గోడలకు హాని కలిగిస్తాయి. వేర్లు రోజురోజుకూ బలిష్టమై నిర్మాణానికి మరింత హానిని కలిగిస్తాయి. అందుకే మొక్కలను నాటేటప్పుడే ఇంటి నిర్మాణానికి ఎలాంటి హాని కలగని ప్రాంతంలో నాటాలి. అందుకు సరైన స్థానం గుర్తించటం ముఖ్యం, కాంపోండ్ వాల్‌కు దగ్గరగాకానీ, ఇంటి గోడకు దగ్గరగాకానీ మొక్కలు ఎట్టిపరిస్థితుల్లో నాటకూడదు. సాధ్యమైనంత వరకు చిన్న మొక్కలను కుండీలో నాటుకుంటే మంచిది.

Comments

comments