Home ఆదిలాబాద్ హరిత హారానికి మొక్కలు సిద్దం

హరిత హారానికి మొక్కలు సిద్దం

Haritha-Haaramముత్యంపల్లి ఫారెస్టు నర్సరీలో 22 రకాల మొక్కలు
కూలీలను పెంచండి
కాసిపేట : మొదటి విడత హరిత హారానికి మొక్కలు అందించలేదని అపవాదం తెచ్చుకున్న ముత్యంపల్లి నర్సరీ, రానున్న హరిత హారానికి 22 రకాల మొక్కలతో సిద్దంగా వుంది. మండలంలోని ముత్యంపల్లి ఫారెస్టు సెక్షన్ పరిధిలోని యాప వద్ద ఫారెస్టు శాఖ నర్సరీని మొదలు పెట్టింది. ప్రస్తుతం పచ్చని మొక్కలతో నర్సరీ కళ కళలాడుతుంది. నర్సరీలో జామ, గూలాబి, చింత, కంక, ఎర్రమద్ది, వెదురు, టేకు, ఉసిరి, కజూరా, నిమ్మ, బొడ్డుమల్లె, మోదుగ, నల్లమద్ది, వేప, అల్లనేరేడు, తాని, దానిమ్మ, గోరింట, మందారం, కానుగ, రేల, ఎగిసా మొక్కలను ఫారెస్టు శాఖ ఆద్వర్యంలో పెంచుతున్నారు. రానున్న హరిత హారం కార్యక్రమంలో మొక్కలను అందించేందుకు సిద్ధంగా వుంచారు. 12 మంది కూలీలతో మొక్కల పెంపకం పనులకు శ్రీకారం చుట్టారు. రోజుకు నలుగురు కూలీల చోప్పున నర్సరీలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా కూలీలు మాత్రం తమకు తక్కువ రోజుల పనులు కల్పిస్తున్నారని వారు వాపోతున్నారు. 12 మందిని మూడు బ్యాచ్‌లుగా విడదీసి నలుగురు వారం చొప్పున పనులు చూపిస్తున్నారని దాంతో తమకు తక్కువ రోజుల కూలీ దొరుకుతుందిని పని భారం పెరుగుతుందని కూలీలు వాపోతున్నారు. అధికారులు సంప్రదించి కూలీల సంఖ్యను పెంచాలని అలాగే పని దినాలను కూడా పెంచాలని వారు కోరుతున్నారు. నిత్యం గడ్డి కలుపు తీయడం, ఎండిన మొక్కల స్థానంలో మళ్లీ విత్తనాలను పెట్టడం, చెట్లకు నీళ్లు పట్టించడం లాంటి పనులు వున్నాయని నలుగురితో సాధ్యం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ సమస్యపై స్పందించాలని వారు కోరుతున్నారు.