Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

దాగి ఉండే ప్లాస్టిక్ తో జాగ్రత్త సుమీ…!

Plastic-bags

ప్లాస్టిక్‌తో అనర్థాలు ఎన్నో. మనం రోజు వాడకునే ప్లాస్టిక్ సంచులను నిషేధించాలంటూ అంతా చెబుతుంటారు. కానీ అంతకంటే మనం రోజూ వాడుకొనే కొన్ని వస్తువుల్లో ప్లాస్టిక్ అంతర్గతంగా ఉంటుంది. పర్యావరణ హితులు, అవేంటో తెలిస్తే కచ్చితంగా ఆయా వస్తువులను వాడకుండా జాగ్రత్త పడతారు. మనం రోజువారీ వస్తువుల్లో ప్లాస్టిక్ ఉండే వస్తువులేంటో చూద్దాం…వాటిని వాడకుండా బ్యాన్ చేద్దాం…కింద చెప్పే వాటిలో ప్లాస్టిక్ ఉన్నట్లు తెలియదు. మనకు కనిపించకుండా ప్లాస్టిక్ ఉంటుంది. మనం వాడే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా హాని జరుగుతుంది. ప్లాస్టిక్‌ను వాడి ఎక్కడపడితే అక్కడ పడేయటం వల్ల జంతువులు, పక్షులు , నీళ్లల్లో కలిస్తే అక్కడ జీవజాలం అవితిని మరణిస్తుంటాయి. మనకు తెలియకుండానే ప్రకృతికి, వాటిలోని జీవానికి ఎంతో హానిచేస్తున్నాం.

టీ బ్యాగ్‌ల్లో ప్లాస్టిక్ ఉంటుందా..అని ఆశ్చర్యపోతున్నారా.. ఉంటుందనే తేలింది. అసలు మనకు తెలియకుండా ఎలా ఉంటుందనుకోకుండా అవేంటో తెలసుకుంటే వాటిని వాడకుండా వుండవచ్చు.

టీబ్యాగ్స్: టీ బ్యాగ్‌ల్లోని రెండు ప్రదేశాల్లో ప్లాస్టిక్ దాగి ఉంటుంది. వేడి నీళ్లలో పెట్టినపుడు పాకెట్ పాడవకుండా బ్యాగ్ లైనింగ్‌గా ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తారు. కొంచెం మోతాదులోనే ఉంటుందది. మరేం చేయాలి టీ బ్యాగ్స్ వాడకూడదా అంటారా..? టీ బ్యాగ్‌లో ప్లాస్టిక్ కాకుండా ఆర్గానిక్ బ్యాగులను వాడితే సరిపోతుంది.

పేపర్ కప్స్: వాడి పడేసే పేపర్ కప్స్‌లో అతి కొద్ది మోతాదులో ప్లాస్టిక్ ఉంటుంది. కప్ లోని పట్టుకునే పై భాగం, అడుగు భాగాన ఉండేది ప్లాస్టిక్. దీనివల్ల కూడా పర్యావరణానికి ప్రమాదమే. అందువల్ల ఇంటిదగ్గర నుంచి గ్లాసులు తీసుకెళ్లడం మంచిది. మన వెంటే ఒక స్టీలు గ్లాసు పెట్టుకోవడం మంచిది.

సిగరెట్ పీకలు: చాలా మంది సిగరెట్ కాల్చాక బాధ్యతారాహిత్యంగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. ఒక్క సిగరెట్ ముక్కతో గ్యాలన్ల నీరు కలుషితమౌతుంది. సిగరెట్‌ను ఫిల్టర్ చేసే సందర్భంలో ప్లాస్టిక్‌ను వాడతారు. సిగరెట్ మానమంటే చాలా మంది పట్టించుకోని విషయం ..అందువల్ల కాల్చిన సిగరెట్ పీకల్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుంటే చాలు. ముఖ్యంగా నేలమీద నీటిలో వేయొద్దు.

డిస్పోజబుల్ పేపర్స్: బేబీ వైప్స్, పర్సనల్ హైజీనిక్ వైప్స్, యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్ ఇలాంటివెన్నో ఉన్నాయి. వీటితో సమస్యలేదుగానీ వీటిని ప్యాక్ చేసే ప్యాకేజింగ్‌తోనే సమస్యంతా. అదంతా ప్లాస్టిక్ ఉంటుంది. అవి రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్. అయినా వైప్స్‌లో కొంత మోతాదులో ప్లాస్టిక్ ఉండటాన్ని మనం ఊహించలేం. సముద్రపు ఒడ్డున వైప్స్‌ను పడేయడం వల్ల తాబేళ్లు వాటిని తిని చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకనే మరీ అవసరమనుకుంటే తప్ప ఇవి మేలు. మేకప్ రిమూవ్ చేసుకోవడానికి గుడ్డను ఉపయోగించాలి.

Comments

comments