Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మారియట్ హోటల్‌లో పేకాట

                        Marriot-Hotel

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని మారియట్ హోటల్‌పై శుక్రవారం ఉదయం టాస్క్‌ఫోర్స్ దాడులు చేసింది. పెద్ద మొత్తంలో నగదు, విదేశీ మద్యం, హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో వ్యాపారవేత్తలు, నగరంలో పేరున్న ప్రముఖులు ఉన్నారు. కీలక సూత్రదారులు సంజయ్, ప్రవీణ్ పరారీలో ఉన్నారని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. మూడు రోజుల నుంచి మారియట్ హోటల్లో ప్రముఖులు పేకాడుతున్నారు. సంజయ్ అనే వ్యక్తి మారియట్ హోటల్లో 17 గదులను వారం రోజులకు బుక్ చేసి ప్రముఖులతో పేకాట ఆడిస్తున్నారు. సంజయ్ అనే వ్యక్తి ఉన్నతాధికారులు, ప్రముఖులు పేర్లు చెప్పి పోలీసులను బెదిరిస్తున్నారు.

Comments

comments