Home మెదక్ స్థానికంగానే కలెక్టరేట్ నిర్మించండి

స్థానికంగానే కలెక్టరేట్ నిర్మించండి

  • ప్రభుత్వం ప్రజల మనోభావాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలి
  • 3వ రోజు కలెక్టరేట్ భవన నిర్మాణం కోసం అభిప్రాయ సేకరణ
  • పాల్గొన్న మాజీ ఎంఎల్‌ఎ శశిధర్‌రెడ్డి, అఖిలపక్ష నాయకులు

Medak-Collectrateమెదక్ : కలెక్టరేటును మెదక్ పట్టణంలోనే నిర్మించాలంటూ జిల్లా ప్రజల అభిప్రాయల కోసం సంతకాల సేకరణ కార్యక్రమం మూడవ రోజులో భాగంగా బుధ వారము నాడు పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుండి స్థానిక వ్యాపార ప్రధాన కూడలి జెయన్‌రోడ్ మీదుగా మార్కెట్ వరకు వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో పాటు వర్థకవాణిజ్య వ్యాపారస్తులతో సంతకాల సేకరణ చేపట్టారు. మూడవ రోజు కూడా 90 శాతానికిపైగా ప్రజలు కలెక్టరేటును స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్దనే నిర్మించాలంటూ భారీ ఎత్తున సంతకాలు చేసి వారి యొక్క అభిప్రాయాలు తెలిపారని నిర్వాహకులు తెలి పారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ పట్లోళ్ళ శశిధర్‌రెడ్డి పాల్గొని చిరు వ్యాపారస్తుల వద్దకు వెళ్లి వారి యొక్క అభిప్రాయాలను అడిగి తెలుసుకుని సంతకాల సేకరణ చేసారు. ప్రజాసౌకర్యార్ధం కోరకై ఏర్పడిన నూతన జిల్లాలో కలె క్టరేటు స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్మింస్తేనే జిల్లా ప్రజ లందరికి కూడా పూర్తి సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన అన్నారు. జిల్లా నలుమూలల నుండి కలెక్టరేటు కార్యాలయం లో తదితర పనుల కోరకై వచ్చే వారికి పట్టణంలో గల ఈ అను వైన ప్రదేశం సరైనదని అన్నారు. కలెక్టరేటు నిర్మించాలంటే సు మారు 20 నుండి 25 ఎకరాల స్థలం కావాలని అందుకు సరి పడ ప్రభుత్వ స్థలం పట్టణంలోనే ఉండగా పక్కగ్రామం వద్ద నిర్మించాలనుకోవడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నిం చారు. ఈ విషయమై ప్రభుత్వం పుణరాలోచించి ప్రజలకు సౌక ర్యవంతమైన, ఖచ్చితమైన నిర్ణయాన్ని తెలియజేసి పట్టణ అభి వృద్ధికై సహకరించాలన్నారు. పట్టణ విస్తీరణ కోరకై ఇంకా ఎన్నో కళాశాలలు యూనివర్సిటిలు నిర్మించుకోవడంకై పట్టణా నికి దూరంగా ఉంటేనే ప్రశాంత వాతావరణలో విద్యార్థులు విద్యనభ్యసించే అవకాశం ఉంటుందని, అందువల్ల పట్టణ విస్తీ ర్ణం పెరిగి ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందన్నారు. బుధవా రము నాడు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మాజీ ఎంఎల్‌ఏ శశిధర్‌రెడ్డితో పాటు మాజీ జడ్పిటిసి, టిడిపి మండల పార్టీ అధ్య క్షుడు మాణిక్యరెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్షులు అఫ్జల్, కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ మెడి మధుసుదన్‌రావు, బిజెపి పట్టణ నాయకులు, మెతుకుసీమ బతుకుపోరు సభ్యులు మహేందర్‌రెడ్డి, జి. సాయి, భరత్‌గౌడ్, రాజీవ్, సుశీల్, అమీర్, ఉమేర్, లడ్డు తదితరులు పాల్గొన్నారు.