Home వరంగల్ మా బడికి దారి చూపండి

మా బడికి దారి చూపండి

ప్రభుత్వ పాఠశాలపై అధికారుల నిర్లక్షం
ఫిర్యాదులు చేసిన పట్టించుకోని అధికారులు
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
దారి చూపాలని విద్యార్థుల వేడుకోలు

భవనం నిర్మించినప్పుడు దారి ఉండేది
నిట్ కళాశాలకు చెందిన ఈస్థలాన్ని గత 4 సంవ త్సరాల క్రితం స్కైర్ ఫీట్ కు ఒక రూపాయి చొప్పున 30 సంవత్సరాలకు అద్దె ప్రతిపాధికగా ఆర్‌ఈసి వారితో అగ్రిమెంటు చేసుకున్నాము. సర్వశిక్షాభ్యాన్ వారు ఈబిల్డింగ్‌ను నిర్మించారు. ఇట్టి విషయాన్ని సంబందించిన అధికారులకు, ప్రజాప్రతినిథులకు ఫిర్యాదు చేసినం ఎవరు పట్టించుకోవడం లేదు.
– సధాతమహర్ష్ ప్రధానోపాధ్యాయుడు

బడికి వెళ్లాలంటే భయం వేస్తుంది
మాబడికి గతంలో సిసి రోడ్డు దారి ఉండేది. మాదారిని కొందరు మూసి వేయడంతో బడి వెనుకాల ఇంట్లో నుంచి రోజు పాఠశాలకు వెళ్తున్నాము. దీనితో వారు మమ్మల్ని తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. దీనితో బడికి వెళ్లాలంటేనే భయం వేస్తుంది. – మహేష్ ,7వ తరగతి

అంకుల్ మా బడికి దారి చూపండి ప్లీజ్
మా అమ్మానాన్న పేదోళ్లు. డబ్బులు లేక ప్రభుత్వ బడికి పంపిస్తున్నారు. నాకు చదువంటే చాల ఇష్టం. బడికి వెళ్లడానికి దారి లేదు. బడికి వెళ్లడానికి రోజు ఇబ్బందులు పడుతున్నాము. కడియం శ్రీహరి అంకుల్, వినయ్‌భాస్కర్ అంకుల్ ఫ్లీజ్ మా బడికి దారి చూపండి.
– జలసాక్షి సాయిప్రియ 2 తరగతి

school-buildingమనతెలంగాణ/హన్మకొండ : హన్మకొండ నగరం నడిబొడ్డున నేషనల్ ఇన్సిస్టూట్ అఫ్ టెక్నాలజి(ఎన్‌ఐటి) ఎదురుగా ఉన్న ప్రశాంతినగర్‌లోని నాణ్యా తండాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(ఆర్‌ఈసి పాఠక్ స్కూల్)కు దారి లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేక అవస్థలు పడుతున్నారు. 1960 ప్రారంభమైన ఈపాఠశాల ఆర్‌ఈసీ క్వాటర్స్‌లో  గత 50 సంవత్సరాలుగా ఎంతో మందిని విద్యను అందించింది.  ఈపాఠశాల భవనం  చిదిలావస్థకు చేరుకోవడంతో  గత 4 సంవత్సరాల క్రితం  ప్రస్తుతం ఉన్న ఈ నూతన భవన్‌లోకి మార్చారు. నూతన భవనంలోకి వెళ్తున్నామని సంబరపడ్డా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. పాఠశాలకు వెళ్లే దారిని కొందరు అక్రమించడంతో ఈపాఠశాలకు రావడానికి పూర్తిగా దారి మూసుకుపోయింది. దీనితో పాఠశాలకు వెళ్లడానికి అనేక ఇబ్బందులు పడుతూ గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులు, ఉపాధ్యాములు, తల్లీదండ్రులు పాఠశాలకు దారి కావాలని అధికారుల, ప్రజాప్రతినిధిల చుట్టు కాళ్లారిగేల తిరిగి వినతి పత్రాలు సమర్పించారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించే నాయకులు, నగరం నడిబొడ్డున ఉన్న ఈపాఠశాల దుస్థితిపై అనేక సార్లు వినతి పత్రాల ద్వార వారి దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని విచారం  వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌కేజీ నుండి ఏడవ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీషు మీడియాలు ఉన్న ఈపాఠశాలలో 125 మంది పేద విద్యార్థిని, విద్యార్థులు విద్యాను అభ్యసిస్తున్నారు. పాఠశాల లోనికి వెళ్లడానికి దారి లేకపోవడంతో బడి వెనుకాల ఇంట్లో నుండి రోజు పాఠశాలకు వెళ్లడం జరుగుతుందని విద్యార్థులు తెలుపుతున్నారు. స్వయాన విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, జిల్లా కలెక్టర్ల  నివాసాలకు కూత వేటు దూరంలో ఉన్న ఈపాఠశాల ఉంది. ఫిర్యాదులు చేసిన వారు పట్టించుకోక పోవడంతో స్థానికలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈప్రాంతంలోని భూములకు ఎక్కువ విలువ ఉండడంతో పాఠశాలకు వెళ్లే దారిని కొందరు భూకబ్జాదారులు అక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఈపాఠశాలకు దారి లేకుండా పోయింది. అన్ని అనుమతులున్నా నిర్మాణాలు చేపడితే నిబందనల ప్రకారం అన్ని ఉన్నాయని తరుచు తనిఖీలు చేసే మున్సిపల్ అధికారులు మాత్రం ఏలాంటి అనుమతులు లేకుండా పాఠశాల దారిలోనే యదేచ్చగా అక్రమ నిర్మాణం చేసిన నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంత్యార్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైన జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు స్పందించి పేద పిల్లలు చదువుకునే ఈపాఠశాలకు దారి చూపాలని విద్యార్థులు, తల్లీదండ్రులు కోరుతున్నారు.