Home మహబూబ్‌నగర్ పరిస్థితి అర్థం చేసుకోండి

పరిస్థితి అర్థం చేసుకోండి

Jupalli-krishna-raoవర్షాల్లేకనే రిజర్వాయర్లన్నీ అడుగంటాయి, జూరాలలో ప్రస్తుతం 314.8 అడుగుల నీరు మాత్రమే ఉంది
మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం ఆదేశానుసారం ప్రాజెక్టు పరిశీలన
ఎస్‌ఈతో చర్చలు, మంత్రి ఆదేశాలతో నీటి విడుదల

మన తెలంగాణ/గద్వాల: ‘ఓవైపు కరువు దృష్టా వర్షాలు అనుకున్న స్థాయిలో పడలేదు. మరోవైపు జూరాల ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజీకి చేరుకుంది. రబీ సీజన్‌కు నీళ్లు వదిలే అవకా శాల్లేవు. రైతులు పరిస్థితిని అర్థం చేసుకోవాలి’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జూరాల ఆయ కట్టు పరిధిలో వేసుకున్న పంటలకు నీరు లేక ఎండి పోతున్నాయని, నీరు వదలాలని కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. దీం తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం మంత్రి జూపల్లి శనివారం జూరాల ప్రాజెక్టును సందర్శించా రు. ఆయకట్టుకు నీరు వదిలేందుకు ఎస్‌ఈ ఖగేందర్ తో చర్చించారు. అనంతరం మంత్రి మీడియాతో మా ట్లాడారు. వర్షాలు అనుకున్న స్థాయిలో పడకపోవ డంతో రిజర్వాయర్లన్నీ అడుగంటిపోయాయని ఆవే దన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జూరాలలో 314.8 అ డుగుల నీరు మాత్రమే ఉందని తెలిపారు. అయితే వ చ్చే జూన్ నాటికి జిల్లా మొత్తానికి తాగునీరు అందిం చాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం సాగునీటిని వదిలే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. గతం లోనే డిసెంబర్ 31 వరకే నీరు వదులుతామని చెప్పి నా జనవరి 8 వరకు కాలువలకు నీరు వదిలినట్లు మంత్రి గుర్తుచేశారు. అయితే వేరుశనగ పంటను దృ ష్టిలో ఉంచుకొని ఒక తడికి నీరివ్వనున్నట్లు తెలిపా రు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నా రు. అలాగే కర్నాటక ముఖ్యమంత్రితో మాట్లాడి ఆల్మ ట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి 4-5 టీఎంసీల నీటిని వదలాలని ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేస్తామని వివరించారు. మంత్రి వెంట జడ్పీచైర్మన్ బండారి భా స్కర్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి, గద్వాల, ధరూర్, మల్దకల్ ఎంపీపీలతో పాటు ఆయా మండలాల జడ్పీటీసీలు, టీఆర్‌ఎస్ నా యకులు పాల్గొన్నారు.
కుడి, ఎడమ కాలువకు నీరు విడుదల
మంత్రి జూపల్లి ఆదేశాల మేరకు శనివారం కుడి కా లువకు 1000 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 500 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు ప్రాజెక్టుల చీఫ్ ఇంజి నీర్ ఖగేందర్ తెలిపారు. పైనుంచి ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజీకి చేరు కుందన్నారు. మంచినీరు, వేరుశనగ పంటల దృష్టా సుమారు వారం రోజుల పాటు నీటి విడుదల కొనసా గుతుందని తెలిపారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నీ టి నిల్వ, ఇతరత్రా విషయాలు సంబంధిత శాఖ మం త్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఎస్‌ఈ వివ రించారు.