Home జాతీయ వార్తలు కరువు కాటేసింది

కరువు కాటేసింది

pmసహాయం ముఖం చాటేసింది : ప్రధానితో కెసిఆర్
అడిగింది బారెడు
ఇచ్చింది వేలెడు
సాయం
భారీగా
పెంచాలి

న్యూఢిల్లీ:కరువు పరిస్థితులపై సమీక్షించేందుకు ప్రధాని మోడీతో సమా వేశమైన సిఎం కెసిఆర్ తెలంగాణ కరువు కష్టాలను వివరిం చారు. కిందటి ఏడాది 14 శాతం తక్కువ వర్షపాతం నమోదు అవడంతో ఏకంగా ఏడు జిల్లాల్లోని 231 మండలాలు, 5519 గ్రామాలు కరువు కాటుకు గురయ్యాయని ప్రధాని దృష్టికి తీసు కొచ్చారు. 1.70 కోట్ల మంది ప్రజలు కరువుతో ఇబ్బంది పడు తుండగా, 13.52 లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయిందని, 23,700 హెక్టార్లలో హార్టికల్చర్ దెబ్బతిన్నదని చెప్పారు. మొత్తంగా 21.78 లక్షల రైతులు నష్టపోయారని తెలిపారు. కరువు కాటు తీవ్రంగా ఉండడంతో 3064 కోట్ల కరవు సాయం కావాలని కేంద్రాన్ని కోరితే కేవలం రూ.712 కోట్లు మాత్రమే కేంద్రం చెల్లించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను అప్పు ల బారి నుంచి తప్పించేందుకు ఈపాటికే రూ.8080 కోట్లను రాష్ట్ర సర్కారు స్వయంగా బ్యాంకులకు చెల్లించగా రానున్న ఖరీఫ్‌లో మరో 4040 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా మని ప్రధానికి వివరించారు. పేదల కడుపు నింపేందుకు పౌరసరఫరాల ద్వారా కేంద్రం చేస్తున్న సాయానికి మరో రూ. 2,500 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించి ప్రజలకు రేషన్ సరకులు సరఫరా చేస్తున్నవిషయాన్ని ప్రధాని దృష్టికి తీసు కొచ్చారు. నీటి వాడకాన్ని తగ్గించేందుకు 39847 హెక్టార్ల సాగుకు బిందు, తుంపర సేద్యానికి అవసరమైన సాయం రాష్ట్ర సర్కారు చేసిందని చెప్పారు. ఈ ఏడు మరో 38640 హెక్టార్లకు పరికరాలు అందిస్తు న్నామని పేర్కొన్నారు. ఇందు కోసం మూడు వందలు కోట్లు ఈపాటికే ఖర్చు పెట్టగా ఈ ఏడు మరో మూడు వందల కోట్లు ఈ ఏడు ఖర్చు చేయనున్నామని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్‌కాకతీయ లాంటి భారీ ప్రాజెక్టులు భూజాన ఉన్నా ఎక్కడా సంక్షేమాన్ని పక్కన పెట్ట లేదని చెప్పారు. కరవు నేపథ్యంలో సా యం కోసం చాచిన చేయికి ఆస రా ఇవ్వకపోతే కరవును శాశ్వ తంగా ఎదుర్కొనేందుకు భారీ ఖర్చు తో చేపట్టిన భగీరథ, మిషన్ కాకతీ య ప్రాజెక్టులను పూర్తి చేయా లా లేక కరపు సహాయ చర్యల కోసం అందుబాటులో ఉన్న ఖజానాను ఖర్చు చేయాలో మీరే చెప్పాలని మోడీతో మొరపెట్టుకున్నారు. భౌగో ళిక , వాతవరణ పరిస్థితుల దృష్టా తెలంగాణలో పండించిన పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా రైతుల నుంచి పత్తికొనుగోలు చేసేందుకు నిరాకరించడంతో చివరకు తనే నేరుగా రంగంలోకి పత్తికి బదులు ప్రత్యామ్యాయ పంటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి కొకరు చేదోడు వాదోడుగా ఉంటేనే ఏ విపత్తు నుంచి అయినా బయట పడవచ్చని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బాకాయిలను త్వరగా చెల్లించడంతో పాటు కరవు సాయాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు.