Search
Monday 24 September 2018
  • :
  • :

ప్రధాని మోడీ 44వ ‘మన్ కీ బాత్’

PM Modi Addresses The Nation in Mann Ki Baat

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం 44వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆరోగ్యం విషయంలో ఫిట్‌నెస్ చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను సంతోషంగా స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఫిట్‌నెస్ విషయంలో ఆటలు కూడా ముఖ్యమైనవి అని ప్రధాని అన్నారు. మన సంప్రదాయ ఆటలు తార్కిక ఆలోచన సామర్థ్యాన్ని పెంచుతాయన్నారు. ఇండియాలో పుట్టిన సంప్రదాయ ఆటలను ఈ వేసవి సెలవుల్లో ఆడుకోవాలని బాలలకు సూచించారు. మెత్తనగాయలు, గోటీ బిళ్ల, కోతికొమ్మచ్చులు, బిళ్ల-కర్ర వంటి ఆటలను ఆడాలని తెలిపారు. అనంతరం 254 రోజులలో 22వేల కిలోమీటర్లు సముద్ర మార్గంలో ప్రయాణించిన మహిళా నావికా బృందాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రశంసించారు. ఈ బృందంలోని ఆరుగురు భారత పుత్రికలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. ఈ ఆరుగురు భారత యువతరానికి స్ఫూర్తి అని కొనియాడారు. ఇక ప్రపంచానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిస్ కాలుష్యం పట్ల మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ సమతుల్యంతోనే మానవాళి మనుగడ సాగించాలని ప్రధాని తెలిపారు.

Comments

comments