Home జాతీయ వార్తలు దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి : మోడీ

దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి : మోడీ

Narendra Modiపాట్నా: దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆదివారం ఆయన బిహార్ లో పర్యటించారు. బరౌనీలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.  పాట్నా మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 70 ఏళ్లుగా ప్రాథమిక సౌకర్యాలు అందని వారికి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పుల్వామా ఘటనపై ఆయన స్పందించారు. ఈ ఘటనతో ప్రజల్లో ఎంతటి ఆగ్రహం పెల్లుబుకుతుందో, తనలోనూ అదే ఆగ్రహం ఉందని ఆయన పేర్కొన్నారు. పాట్నాకు చెందిన వీర జవాను సంజయ్‌ కుమార్‌ సిన్హా, భాగల్‌పూర్‌కు చెందిన రతన్‌ కుమార్‌కు ఆయన నివాళులు అర్పించారు. దేశం కోసం వీర జవాన్లు చేసిన ప్రాణ త్యాగం వృథా పోదని ఆయన చెప్పారు. వీర జవాన్ల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. తమ పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన చెప్పారు. బిహార్‌తో పాటు తూర్పు భారత‌ రాష్ట్రాలకు ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా ఉర్జా గంగా గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలను గ్యాస్‌ పైప్‌లైన్‌లతో కలుపుతున్నామని మోడీ తెలిపారు. మైట్రోరైలు ప్రాజెక్టు పాటలీపుత్ర మీదుగా కూడా నిర్మిస్తున్నామని, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనేక ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

PM Modi Comments on Pulwama Attack