Home జాతీయ వార్తలు ఎన్డిఎ పక్షనేతగా మోడీ

ఎన్డిఎ పక్షనేతగా మోడీ

 

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీని ఎన్డిఎ పక్షనేతగా జాతీయ ప్రజాస్వామ్య కూటమిలోని ఎంపీలంతా కలిసి ఎన్నుకున్నారు. శనివారం ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో జరిగిన ఎన్డిఎ పక్ష సమావేశంలో మోడీ పేరును అమిత్‌షా ప్రతిపాదించగా.. కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ,  రాంవిలాస్‌ పాసవాన్‌, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే తదితరులు బలపరిచారు. ఈ సమావేశానికి బిజెపి, మిత్రపక్షాలు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా ఎన్డిఎ పక్ష నేతలు, ఎంపిలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ‘ తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన వారందరికీ అభినందనలు. ఎన్డీయేపక్ష నేతగా నన్ను మీరు ఎన్నుకుని ఉండొచ్చు. కానీ నేను కూడా మీలో ఒకడినే. మనమంతా సమానం. నా ప్రత్యర్థి ఎవరని నన్ను అడిగారు. నాతో నాకే పోటీ. ఈ ఎన్నికల్లో ఘన విజయం తన మీద మరింత బాధ్యత పెంచింది.  ఈ ఐదేళ్లలో భారత్‌ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాం. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఈసారి కూడా సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం’ అని నరేంద్ర మోడీ అన్నారు.

PM Modi elected as leader of NDA